IBA: బ్యాంకు ఉద్యోగుల డీఏ పెంపు!
ABN , Publish Date - Jun 11 , 2024 | 09:58 PM
బ్యాంకు ఉద్యోగుల డీఏ పెరిగినట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు ఉద్యోగుల డీఏ పెరిగినట్టు ( Bank Employees DA Hike) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకటించింది. మే, జూన్, జులై నెలలకు గాను 15.67 శాతం మేర డీఏ పెరిగినట్టు పేర్కొంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండస్ట్రియల్ వర్కర్స్‌కు చెందిన సగటు కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ధరల సూచి) ఈ ఏడాది జనవరిలో 138.9, ఫిబ్రవరిలో 139.2, మార్చిలో 138.9గా ఉంది. దీంతో, మార్చితో ముగిసిన త్రైమాసికంలో ధరల సగటు సూచి 139గా తేలింది. ధరల సూచి ముదింపుకు 2016 ను బేస్ సంవత్సరంగా పరిగణిస్తున్నారు. బేస్ వాల్యూను 123.03గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీపీఐలో 15.97 పాయింట్ల మార్పు చోటుచేసుకుంది.
Stock Market: మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు.. స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్!
మరోవైపు, బ్యాంకు ఉద్యోగుల వేతనాలు ఏటా 17 శాతం మేర పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ వేతనాల పెంపు సుమారు 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. బ్యాంకులపై అదనంగా రూ. 8,284 కోట్ల భారం పడనుందని సమాచారం.
Read Business and Telugu News