Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు సెలవులు
ABN , Publish Date - Sep 14 , 2024 | 06:28 PM
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులన్నింటికీ సోమవారం సెలవే. ఈ నెలలో బ్యాంకులకు 15 రోజులపాటు సెలవులు ఉన్నాయి. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతోపాటు వివిధ పండగలకు హాలిడేలు ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులన్నింటికీ సోమవారం సెలవే. ఈ నెలలో బ్యాంకులకు 15 రోజులపాటు సెలవులు ఉన్నాయి. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతోపాటు వివిధ పండగలకు హాలిడేలు ఉంటాయి. ఓనం పురస్కరించుకుని శనివారం కేరళలో బ్యాంకులు మూతబడ్డాయి.
ముస్లింలకు పవిత్రదినం..
వచ్చే సోమవారం(సెప్టెంబర్ 16)నాడు ముస్లింలకు సంబంధించి ఈద్ - ఇ - మిలద్ పండుగను పురస్కరించుకుని అన్ని బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ప్రవక్త హజ్రత్ మహమ్మద్ పుట్టిన రోజు సందర్భంగా ఈద్ - ఇ - మిలద్‌ను జరుపుకుంటారు. దీనిని నబీ డే లేదా మౌలిద్ అని కూడా అంటారు. ఆరోజు ముస్లింలంతా మసీదులో ఒక చోట చేరి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ప్రవక్త హజ్రత్ బోధనలను వివరిస్తారు.
మిగతా రోజుల్లో...
సెప్టెంబర్ 15 (ఆదివారం)- కేరళలో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 16 (సోమవారం) - ఈద్-ఎ-మిలాద్ - దేశమంతటా సెలవు
సెప్టెంబర్ 17 (మంగళవారం) - గణేశ నిమజ్జనం - అన్ని బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 18 (బుధవారం) - పాంగ్-లాబ్సోల్, శ్రీ నారాయణ గురు జయంతి - కేరళ, అసోంలోని బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 21 (శనివారం): శ్రీనారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కేరళలో బ్యాంకులు మూతపడనున్నాయి.
సెప్టెంబర్ 22 (ఆదివారం): బ్యాంకులన్నీ బంద్
సెప్టెంబర్ 23 (సోమవారం): మహారాజా హరి సింగ్ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులు బంద్.
సెప్టెంబర్ 28 (శనివారం): నాలుగో శనివారం అన్ని బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 29 (ఆదివారం): బ్యాంకులన్నీ బంద్
అయితే సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్‌లు తమ లావాదేవీలను జరుపుకోవచ్చు.
For Latest News and National News click here