Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే! జాగ్రత్తగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి!
ABN , Publish Date - Jun 24 , 2024 | 10:18 PM
జులైలో బ్యాంకులకు 12 రోజులకు సెలవులు ఉన్నాయి. వారాంతపు సెలవులు, ప్రాంతీయ పండుగలు కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నె్ట్ డెస్క్: జులైలో బ్యాంకులకు 12 రోజులకు సెలవులు ఉన్నాయి. వారాంతపు సెలవులు, ప్రాంతీయ పండుగలు కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులని వెల్లడించింది. సెలవుల్లో యథాప్రకారం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సెలవులను పరిగణనలోకి తీసుకుంటూ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులో (Bank Holidays) చెబుతూ ఆర్బీఐ ఓ జాబితా విడుదల చేసింది.
లిస్టు ఇవే
తేదీ | రాష్ట్రం | |
జులై 3 | బేహ్ దీంఖ్లామ్ | మేఘాలయ |
జులై 6 | ఎమ్‌హెచ్‌ఐపీ డే | మిజోరం |
జులై 7 | ఆదివారం | దేశవ్యాప్తంగా సెలవు |
జులై 8 | కాంగ్ (రథజాత్ర) | మణిపూర్ |
జులై 9 | ధ్రుక్పా షేజీ | సిక్కిమ్ |
జులై 13 | శనివారం | దేశవ్యాప్తంగా సెలవు |
జులై 14 | ఆదివారం | దేశవ్యాప్తంగా సెలవు |
జులై 16 | హరేలా | ఉత్తరాఖండ్ |
జులై 17 | ముహర్రం | |
జులై 21 | ఆదివారం | దేశ్యాప్తంగా సెలవు |
జులై 27 | శనివారం | దేశ్యాప్తంగా సెలవు |
జులై 28 | ఆదివారం | దేశ్యాప్తంగా సెలవు |