Share News

Personal Finance: క్రెడిట్ స్కోరు 800 దాటితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ABN , Publish Date - Dec 13 , 2024 | 07:35 PM

క్రెడిట్ స్కోరు 800 దాటితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోరుకున్న ఉద్యోగం లభించడం మొదలు తక్కువ వడ్డీకి లోన్లు, తక్కువ ప్రీమింయలకు ఇన్సూరెన్స్ వరకూ అభిస్తుందని చెబుతున్నారు.

Personal Finance: క్రెడిట్ స్కోరు 800 దాటితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ స్కోరు 800 దాటితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోరుకున్న ఉద్యోగం లభించడం మొదలు తక్కువ వడ్డీకి లోన్లు, తక్కువ ప్రీమింయలకు ఇన్సూరెన్స్ వరకూ అభిస్తాయని చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించి క్రెడిట్ స్కోరు పెంచుకున్న వారు ఇప్పటికే అనేక ప్రయోజనాలు పొందారని సోదాహరణంగా చెబుతున్నారు (Personal Finance).

నిపుణులు చెప్పేదాని ప్రకారం, క్రెడిట్ స్కోరు 800 దాటిన కొందరు తమ వెహికిల్ ఇన్సూరెన్స్‌ను గతంలో కంటే తక్కువ ప్రీమియంకే రెన్యూవల్ చేసుకోగలిగారు.

Personal Finance: మీ నెల జీతం రూ. లక్షన్నరా? ఇంతకు మించి ఖరీదైన ఇల్లు మాత్రం కొనొద్దు!


ఇక ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా కంపెనీలు ఈ మధ్య క్రెడిట్ స్కోరును పరిశీలిస్తున్నాయట. బ్యాకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఈ తీరు స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తులో ఈ ఒరవడి ఇతర రంగాలకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. క్రెడిట్ స్కోరు ద్వారా ఉద్యోగార్థి తీరుతెన్నులను మరింత లోతుగా పరిశీలించే అవకాశం కంపెనీలకు లభిస్తోంది. అప్పుల్లో ఉన్నారా, చెల్లింపుల్లో జాప్యాలు ఏమైనా ఉన్నయా అన్న అంశాల ఆధారంగా ఉద్యోగుల ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే, అభ్యర్థుల అనుమతి తీసుకున్నాకే కంపెనీలు వారి క్రెడిట్ స్కోరు చెక్ చేసేందుకు అవకాశం ఉంటుందట.

Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!


మంచి క్రెడిట్ స్కోరుతో ఆటో, హెల్త్, ఇతర రకాల ఇన్సూరెన్సుల ప్రీమియం తగ్గుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. లోన్ ఇచ్చేటప్పుడు రిస్క్‌ను అంచనా వేసేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యక్తుల క్రెడిట్ స్కోరును చూస్తున్నాయి. ఈ స్కోరు బాగున్న వారికి కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలో 15 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నాయట.

ఇక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి లోన్లు త్వరగా లభిస్తాయన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత లోన్లు, ఇంటి రుణాలు, కారు లోన్లు సహా ఇతర అనేక రకాల రుణాలను సులువగా పొందొచ్చు. అంతేకాకుండా, కంపెనీలతో కాస్త చర్చించి వడ్డీ రేట్లను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రుణ పరిమితి కూడా పెరుగుతుందని అంటున్నారు.

ఈఎంఐల చెల్లింపుల్లో జాప్యం, క్రెడిట్ కార్డు అప్పులను తరచూ వాయిదా వేయడం వంటివన్నీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. రుణాలకు సంబంధించి సెటిల్మెంట్లు, రైటాఫ్‌ల వల్ల కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.

Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!

Read Latest and Business News

Updated Date - Dec 13 , 2024 | 07:41 PM