Share News

Diwali Gifts: ఆత్మీయులకు ఈ బహుమతులిస్తే.. డబ్బులే డబ్బులు..

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:00 PM

దీపావళి వచ్చేసింది. పండుగ రోజు ఇష్టమైన వారికి బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తే కలిగే అనుభూతి చెప్పలేనిది. బహుమతి అనగానే చీరలు, గిఫ్టులు, ఎలక్ట్రానిక్ గ్యాడెట్లు మన మైండ్లోకి వస్తాయి.

Diwali Gifts: ఆత్మీయులకు ఈ బహుమతులిస్తే.. డబ్బులే డబ్బులు..

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి వచ్చేసింది. పండుగ రోజు ఇష్టమైన వారికి బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తే కలిగే అనుభూతి చెప్పలేనిది. బహుమతి అనగానే చీరలు, గిఫ్టులు, ఎలక్ట్రానిక్ గ్యాడెట్లు మన మైండ్లోకి వస్తాయి. అయితే బహుమతులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ కేటగిరీలో దుస్తులు, గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్ ఫోన్‌లు, గిఫ్ట్ హ్యాంపర్‌లు తదితరాలు ఉంటాయి. అయితే ఆర్థిక భరోసానిచ్చే గిఫ్టులు కూడా ఉంటాయని మీకు తెలుసా. ఇవి అత్యవసర సమయాల్లో ఆత్మీయులకు అండగా నిలుస్తాయి. వాటిని గిఫ్టుగా ఇస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం..

గోల్డ్ ఇటిఎఫ్: బంగారు ఇటీఎఫ్‌లు (ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు) దీపావళికి అద్భుతమైన కానుక అని చెప్పుకోవచ్చు. ETF గ్రహీత తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. గోల్డ్ ఇటీఎఫ్‌లు బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. సాధారణ షేర్ల లాగే ఏ క్షణంలోనైనా వీటిని విక్రయించవచ్చు. ఆభరణాల మాదిరిగా కాకుండా ETFలు డీమ్యాట్ రూపంలో వచ్చినందున భద్రత లేదా నిల్వ ఆందోళనతో యజమాని బాధపడాల్సిన అవసరం లేదు.


ఫిక్స్‌డ్ డిపాజిట్లు: ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఎఫ్‌డీలు సురక్షితమైన రాబడిని అందిస్తాయి. కాబట్టి ఎఫ్‏డీలు అద్భుతమైన బహుమతి అని చెప్పుకోవచ్చు. FDలను బ్యాంకుల నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు.

రికరింగ్ డిపాజిట్లు: వీటిని RDలు అని కూడా అంటారు. పొదుపు క్రమశిక్షణను పాటించడానికి ఇవి ఉపయోగపడతాయి. బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో ఈ ఖాతాలను తెరవవచ్చు. FDలలాగే RDలు కూడా తక్కువ నష్టాన్ని కలిగి ఉంటాయి.


బీమా పాలసీ: బీమా పాలసీ అత్యుత్తమ బహుమతుల్లో ఒకటి. ప్రియమైన వారి కోసం ఆరోగ్య బీమా ప్రీమియం కొనుగోలు చేయడం మంచిది. సింగిల్ ప్రీమియం ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం వల్ల ఆసుపత్రులకు వెళ్తే జేబుకు చిల్లు పడుతుంది. ఆరోగ్య బీమా చేయించడం ఆత్మీయులకు మంచి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. మరొక విలువైన బహుమతి టర్మ్ జీవిత బీమా. ఎండోమెంట్ పాలసీలతో పోలిస్తే, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ చౌకగా ఉంటుంది. ఆత్మీయుల జీవితానికి భరోసా ఇవ్వడానికి టర్మ్ పాలసీని బహుమతిగా ఇవ్వవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (SSY): ఆడపిల్లలకు బహుమతిగా ఏదైనా ఇవ్వాలనుకుంటే, సుకన్య సమృద్ధి యోజన తీసుకోవడం మంచిది. ఇది 8.2 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి...

నాకు బిర్యానీ పెట్టండి

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read Latet Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 05:00 PM