Share News

Diwali bank holiday 2024: దీపావళికి ఏ రోజు బ్యాంక్ సెలవు?

ABN , Publish Date - Oct 23 , 2024 | 08:11 PM

దీపావళి సహా వివిధ రాష్ట్రాల్లో ఇతర పండగలు జరగనున్న నేపథ్యంలో.. బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. కొన్ని చోట్ల వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Diwali bank holiday 2024: దీపావళికి ఏ రోజు బ్యాంక్ సెలవు?

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సహా వివిధ రాష్ట్రాల్లో ఇతర పండగలు జరగనున్న నేపథ్యంలో.. బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. కొన్ని చోట్ల వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండగ సందర్భంగా బ్యాంక్ హాలిడే ఎప్పుడు. తెలంగాణ, ఏపీల్లో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయనేది తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాల్లో అక్టోబర్ 31న(గురువారం) దీపావళి జరుపుకుంటున్నారు. దీంతో ఆ రోజు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ సహా అనేక రాష్ట్రాలు నవంబర్ 1న దీపావళి జరుపుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో శుక్రవారం సెలవు ప్రకటించారు. బ్యాంకులకు వెళ్లాలనుకుంటున్న వారు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక విద్యా సంస్థలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం 5 రోజులు సెలవులు ప్రకటించగా.. తమిళనాడు సర్కార్ అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీలను సెలవులుగా నిర్ణయించింది.


  • అక్టోబర్ 2024న బ్యాంక్ సెలవులు

  • అక్టోబర్ 1: జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా సెలవు.

  • అక్టోబర్ 02: మహాత్మా గాంధీ జయంతి/మహాలయ అమావాస్య

  • అక్టోబర్ 03: శారదీయ నవరాత్రులు, మహారాజా అగ్రసేన్ జయంతి.

  • అక్టోబర్ 06: ఆదివారం సెలవు

  • అక్టోబర్ 10: మహా సప్తమి/దుర్గాపూజ/దసరా

  • అక్టోబర్ 11: దసరా (మహాష్టమి/మహానవమి)/ఆయుధ పూజ/దుర్గాపూజ (దసైన్)/దుర్గా అష్టమి

  • అక్టోబర్ 12: దసరా/దసరా (మహానవమి/విజయదశమి)/దుర్గాపూజ, రెండో శనివారం.

  • అక్టోబర్ 13: ఆదివారం సెలవు

  • అక్టోబర్ 14: గాంగ్‌టక్‌లో దుర్గా పూజ (దసైన్), దసరా.

  • అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతా).

  • అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి/కటి బిహు

  • అక్టోబర్ 20: ఆదివారం సెలవు

  • అక్టోబర్ 26: విలీన దినం (జమ్మూ కశ్మీర్), నాలుగో శనివారం.

  • అక్టోబర్ 27: ఆదివారం సెలవు

  • అక్టోబర్ 31: దీపావళి (దీపావళి)/కాళీ పూజ/సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు/నరక చతుర్దశి

Diwali 2024: దీపావళి ఏ రోజు? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?

For Latest News and National News Click here

Updated Date - Oct 23 , 2024 | 08:15 PM