Share News

EPFO: ఇకపై ఈపీఎఫ్‌ఓ నిధి నుంచి రూ.లక్ష ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే..

ABN , Publish Date - Sep 21 , 2024 | 07:49 PM

ఒకప్పుడు రూ.50 వేలుగా ఉన్న ఈపీఎఫ్ఓ వన్ టైం విత్‌డ్రాల్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.లక్షకు పెంచింది. కొత్త ఉద్యోగంలో చేరిన ఆరు నెలల లోపు పీఎఫ్ నిధిలో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది.

EPFO: ఇకపై ఈపీఎఫ్‌ఓ నిధి నుంచి రూ.లక్ష ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే..
Early PF withdrawl

ఇంటర్నెట్ డెస్క్: రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన ఈపీఎఫ్‌ఓ నిధులను ప్రజలు అత్యవసర సందర్భాల్లో వినియోగించుకోవచ్చు. అవసరం ఉన్న సమయంలో ఈపీఎఫ్‌ఓ నిధులవైపు మళ్లుతారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సౌలభ్యం అందుబాటులోకి తెచ్చింది.

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

ఒకప్పుడు రూ.50 వేలుగా ఉన్న వన్ టైం విత్‌డ్రా మొత్తాన్ని ప్రస్తుతం రూ.లక్షకు పెంచింది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉద్యోగశాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. అత్యవసర సందర్భాల్లో పెన్షన్ ఫండ్ సబ్‌స్క్రైబర్లకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో పరిమితి పెంచానని ఆయన చెప్పారు. కొత్త ఉద్యోగంలో చేరిన ఆరు నెలల లోపే పీఎఫ్‌లో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని అన్నారు.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ


‘‘గతంలో ఎక్కువ కాలం వేచి చూడాల్సి వచ్చేది. పీఎఫ్ కాంట్రిబ్యూటర్స్ ఇప్పుడు (కొత్త ఉద్యోగంలో చేరిన..) తొలి ఆరు నెలలలోపే డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అది వారి డబ్బే కదా’’ అని కామెంట్ చేశారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా ప్రకటన చేశారు. అపద సమయాల్లో నిధుల లభ్యత పెంచేలా విత్‌డ్రా విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

  • నగదు ఉపసంహరణ కోసం ఈపీఎఫ్‌ఓ ఈ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

  • విత్‌డ్రా కోసం ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ కూడా అవసరం

  • ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల ప్రకారం, విత్‌డ్రా దరఖాస్తు ప్రాసెస్ చేసేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది.

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక


  • ఇక డబ్బు ఉపసంహరణకు గల కారణాలకు కూడా స్పష్టంగా పేర్కొనాలి. విద్య, వైద్యం లేదా ఇతర వ్యక్తిగత అవసరాలు ఏమిటనేది ప్రస్తావించాలి.

  • గతంలో ఓసారి నగదు ఉపసంహరించుకున్నట్టైతే ఆ ప్రక్రియ పూర్తైనదీ లేనిదీ స్పష్టంగా తనిఖీ చేసుకోవాలి.

  • e-Sewa ఫోర్టల్‌లో యూఏఎన్ నంబర్‌ ద్వారా లాగిన్ అయ్యి నగదు ఉపసంహరణ దరఖాస్తును సమర్పించాలి.

Read Latest News and National News

Updated Date - Sep 21 , 2024 | 08:25 PM