Share News

Gold Price Today: అదిరిపోయే వార్త.. తగ్గుతున్న బంగారం ధరలు

ABN , Publish Date - Sep 02 , 2024 | 06:47 AM

మగువలకు గుడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు(gold price today) స్వల్పంగా తగ్గాయి.10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66,940కి చేరింది.

Gold Price Today: అదిరిపోయే వార్త.. తగ్గుతున్న బంగారం ధరలు

హైదరాబాద్: మగువలకు గుడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు(gold price today) స్వల్పంగా తగ్గాయి.10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66,940కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 66,950గా ఉంది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 73,030 వద్ద కొనసాగుతోంది. ఆదివారం రూ. 73,040గా ఉండేది.

100 గ్రాముల 24 క్యారెట్ల ధర పసిడి ధర రూ.100 మేర తగ్గి రూ. 7,30,300 వద్ద కొనసాగుతోంది. ఒక గ్రామ్ గోల్డ్​ ధర రూ.7,303గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశవ్యాప్తంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం ధరలు సోమవారం తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,090, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,940 పలుకుతోంది. 24 క్యారెట్ల ధర 73,030గా ఉంది. ముంబయి, పుణె తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గాను, 24 క్యారెట్ల ధర రూ. 73,030, బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,940, 24 క్యారెట్ల ధర రూ. 73,030గాను ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశవ్యాప్తంగా వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. ఇవాళ ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ. 86,900గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ. 87,000గా ఉండేది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతోంది.

For Latest News click here

Updated Date - Sep 02 , 2024 | 06:47 AM