Gold Prices Today: వరుసగా రెండో రోజు.. స్వల్పంగా క్షీణించిన బంగారం ధరలు
ABN , Publish Date - Sep 01 , 2024 | 07:24 AM
మగువలకు కాస్త ఊరటనిచ్చే విషయమే ఇది. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది.
హైదరాబాద్: మగువలకు కాస్త ఊరటనిచ్చే విషయమే ఇది. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. దీంతో బంగారం ధరలు పెరగడం పక్కా అని తెలుస్తోంది. కాబట్టి బంగారం కొనేవారికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలెలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,100కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కూడా ముంబయిలో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో సైతం బంగారం ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి. హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,040గా ఉంది.
వెండి...
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,000గా ఉండగా.. ముంబయిలో రూ. 87,000, బెంగళూరులో రూ. 85,000 వద్ద కొనసాగుతోంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,900 వద్ద ట్రేడవుతోంది.
For Latest News click here