Share News

Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మీ నగరంలో ఎంతంటే?

ABN , Publish Date - Sep 08 , 2024 | 07:04 AM

వినాయకచవితి సందర్భంగా శనివారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం భారీగా తగ్గాయి. తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.410 తగ్గింది.

Gold Prices: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మీ నగరంలో ఎంతంటే?

ఇంటర్నెట్ డెస్క్: వినాయకచవితి సందర్భంగా శనివారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం భారీగా తగ్గాయి. తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.410 తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,870లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800ల వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందున.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


  • కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,870 వద్ద ఉంది.

  • దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ.66,950కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020 వద్ద కొనసాగుతోంది.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,870 వద్ద కొనసాగుతోంది.

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,800గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 72,870వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఇవాళ10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,870గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,870గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


వెండి ధరలు...

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 84,500గా ఉండగా.. కోల్‌కతాలో రూ. 85 వేలు, బెంగళూరులో రూ. 82,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 89,500 గా ఉంది.

For Latest News click here

Updated Date - Sep 08 , 2024 | 07:31 AM