Gold Prices: మగువలకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Aug 30 , 2024 | 06:39 AM
మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా దిగివచ్చాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 67,140(క్రితం రోజు 67,150)కి చేరింది.
హైదరాబాద్: మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా దిగివచ్చాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 67,140(క్రితం రోజు 67,150)కి చేరింది.1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,714గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సైతం రూ.10 తగ్గి.. రూ. 73,240(క్రితం రోజు 73,250)కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,290గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,390గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,140 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 73,240గా ఉంది. ముంబయి, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,140గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,240గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవి..
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,140, 24 క్యారెట్ల ధర రూ. 73,240గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తదితర అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరల తగ్గుదల..
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ. 88,400కి(క్రితం రోజు రూ.88,500) చేరింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 93,400గా ఉంది.
For Latest News click here