Gold Price: బంగారం కొంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్
ABN , Publish Date - Oct 21 , 2024 | 06:42 AM
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు సోమవారం కళ్లెం పడింది. దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఇప్పటికే తులం మేలిమి బంగారం రూ.80 వేల వరకు చేరుకుంది. ఇవాళ రూ.10 మేర తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు సోమవారం కళ్లెం పడింది. దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఇప్పటికే తులం మేలిమి బంగారం రూ.80 వేల వరకు చేరుకుంది. ఇవాళ రూ.10 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 79,410గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,941గా ఉంది.
10గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 72,790కి చేరింది. 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.7,279గా ఉంది.
దేశవ్యాప్తంగా ధరలివి..
దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,920గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,560గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,790గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్.. 79,410 పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 72,790గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 79,410గా ఉంది. ముంబయి, పుణె, తిరువనంతపురంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 72,790, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,410గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ధర రూ. 72,790గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 79,410 పలుకుతోంది. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
బంగారం బాటలో వెండి..
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. దేశంలో వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పడ్డాయి. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 99,400గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,06,900 గా ఉంది.
MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్ చిత్రీకరణ
For Latest News and National News click here