Pan Card: మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నాయా? రిస్క్‌లో పడ్డారుగా!
ABN , Publish Date - Sep 14 , 2024 | 08:04 PM
ఐటీ చట్టం ప్రకారం, వ్యక్తుల వద్ద ఒకటికి మించి పాన్ కార్డులు ఉండటం నిషిద్ధం. ఇలాంటి వారు తమ వద్ద ఉన్న అదనపు పాన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. లేకపోతే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐటీ శాఖ జారీ చేసే ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను పాన్ అకౌంట్ నంబర్ అంటారు. భారత్‌లో ఆర్థికకార్యకలాపాలు నిర్వహించే వారికి పాన్ అత్యవసరం. ఇది గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడటంతో బ్యాంక్ అకౌంట్లు తెరవడం మొదలు అనేక ఆర్థిక లావాదేవీలకు కీలకంగా మారింది (Pan Card).
పాన్ కార్డ్ ఉపయోగం ఇలా..
పాన్ కార్డుపై పేరు, ఫొటో, పుట్టిన తేదీ, ఉంటాయి. ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేకమైన పాన్ నెంబర్‌ను కేటాయిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులకు ఒకే పాన్ సంఖ్యను కేటాయించరు. ప్రజలు నిర్వహించే ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులను కచ్చితత్వంతో రికార్డు చేసేందుకు, అక్రమాలు జరగకుండా గట్టి నిఘా పెట్టేందుకు ఇది అవసరం.
Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!
ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉండొచ్చా?
ఐటీ శాఖ నిబంధనల ప్రకారం, ఒకే వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం నిషిద్ధం. అంతేకాకుండా, ఒక వ్యక్తి తన పాన్ సంఖ్యను మరొకరికి బదిలీ కూడా చేయలేరు. ఇక రెండు పాన్ కార్డులు ఉన్న వారు చట్టపరమైన జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది (What Happens If You Have Two PAN Cards Check Penalty).
Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!
ఐటీ చట్టం 1961, సెక్షన్ 272బీ ప్రకారం, రెండు పాన్ కార్డులు ఉన్న వారిపై ఐటీ శాఖ చట్టపరమైన చర్యలు చేపడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం, ఒకటికి మించి పాన్ కార్డులు ఉంటే రూ.10 వేల జరిమానా విధించే అకాశం ఉంది.
కాబట్టి, ప్రతి ఒక్కరూ చట్టానికి బద్ధులై ఉండాలి. అదనంగా తమకు మరో కార్డు ఉన్నట్టైతే వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి.
1961 ఐటీ చట్టంలో 2017లో ఫైనాన్స్ యాక్ట్ ద్వారా సెక్షన్ 139ఏఏను చేర్చారు. దీని ప్రకారం, పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు తమ వద్ద ఉన్న ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి.