Share News

Horoscope Today: వావ్.. ఈ రాశి వారికి అన్నీ శుభవార్తలే.. చెక్ చేసుకోండి..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 07:17 AM

నేడు (24-4-2024 బుధవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు..

Horoscope Today: వావ్.. ఈ రాశి వారికి అన్నీ శుభవార్తలే.. చెక్ చేసుకోండి..!

నేడు (24-4-2024 బుధవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధించండి.


MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. వ్యాపార రంగంలోని వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. సమావేశాల్లో ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. గణపతి ఆరాధన శుభప్రదం.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. యోగ ధ్యానాలు, డైటింగ్‌పై దృష్టి సారిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రకటనలు, క్రీడలు, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుబంధాలు బలపడతాయి.


MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. ఉన్నత పదువుల అందుకుంటారు. స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్ల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఉ ల్లాసం కలిగిస్తాయి. మెయిల్స్‌, సందేశాలు అందుకుంటారు. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెన్షన్‌, గ్రాట్యుటీ నిధులు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థిత ప్రోత్సాహకరంగా ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. పందాలు, పోటీల్లో విజయం సాఽధిస్తారు. భాగస్వామి గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారి కృషి ఫలిస్తుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. ఎగుమతులు, కళలు, వస్త్రాలు, ఫొటోగ్రఫీ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబందాలు బలపడతాయి. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

తల్లిందండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. రవాణా, బోదన, న్యాయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Apr 24 , 2024 | 07:29 AM