Share News

Horoscope: ఆర్థికంగా ఈ రాశుల వారికి నేడు సూపరో సూపర్!

ABN , Publish Date - Mar 08 , 2024 | 07:17 AM

శుక్రవారం పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది....

Horoscope: ఆర్థికంగా ఈ రాశుల వారికి నేడు సూపరో సూపర్!

నేడు (8-3-2024) - శుక్రవారం పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరమైన రోజు ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యాపార విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. ప్రింటింగ్‌, టెలివిజన్‌, న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. బృందకార్యక్రమాలు ఆనందాన్నిస్తాయి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను పరామర్శిస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆ రోగ్యం మెరుగుపడుతుంది. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాలకు అనుకూలమైన రోజు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపార రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. వాణిజ్యం, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్‌ కంపెనీల వారు లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సృజనాత్మక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. చిన్నారులకు వసతి ల భిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆలయ దర్శనం శుభప్రదం

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

మార్కెటింగ్‌, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాల్లో కొంత నిదానం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అనవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చర్చలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్‌ ఉ ల్లాసం కలిగిస్తుంది. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. పట్టుదలతో పని చేసి సంకల్పం సాధిస్తారు.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఎగుమతులు, కన్సల్టెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరగా ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, టెక్స్‌టైల్స్‌, కళల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Mar 08 , 2024 | 08:35 AM