Zodiac signs: ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలట!
ABN , Publish Date - Mar 10 , 2024 | 07:24 AM
నేడు (10-3-2024 - ఆదివారం) దూరప్రయాణాలకు, వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోండి. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం....
నేడు (10-3-2024 - ఆదివారం) దూరప్రయాణాలకు, వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోండి. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం....
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలకు, వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోండి. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా పూర్తవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. దుర్గామాత ఆలయదర్శనం శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్‌లు, వడ్డీ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. ఆదిత్య హృదయ పారాయణశుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. పైఅధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తికాక ఇబ్బందపడతారు. సూర్య అష్టక పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించండి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాల వారు ఆలోచించి ముందుడగు వేయాలి. దుర్గామాతను ఆరాధించండి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సకాలంలో డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. పన్నులు, బ్యాంక్‌లోన్‌ల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. పెన్షన్, మెడికల్ క్లెయిములు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గోమాత ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదుర్కొంటారు. సన్నిహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పందాలు పోటీలకు దూరంగా ఉండాలి. భాగస్వామి వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. దుర్గా అష్టోత్తరశతనామ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. ఫార్మా, హాస్టళ్లు, ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదరవుతుంది. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం. సూర్యభగవానుడిని ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. భూములు, ఇళ్ల క్రయవిక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. హార్డ్‌వేర్, నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల వ్యవహారశైలి ఇబ్బంది కలిగిస్తుంది. చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. చెక్కులు, పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడతారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. గోమాతను ఆరాధించండి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కోల్పోయే అ వకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ముందు వెనుకలు ఆలోచించాలి. విలాలసాకు ఖర్చు చేస్తారు. ఆదిత్య హృదయయ పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించే అ వకాశం ఉంది. అయినా ఓరిమితో లక్ష్యాలు సాధించే ప్రయత్నం చేస్తారు. గోసేవ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ