Horoscope: ఇవాళ ఏ ఏ రాశుల వారికి బాగుందంటే..
ABN , Publish Date - Mar 29 , 2024 | 06:33 AM
నేడు (29-2-2024 - శుక్రవారం) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలం. ఇన్‌స్టాల్‌మెంట్లు, లోన్‌లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం...
నేడు (29-2-2024 - శుక్రవారం) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలం. ఇన్‌స్టాల్‌మెంట్లు, లోన్‌లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం...
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలం. ఇన్‌స్టాల్‌మెంట్లు, లోన్‌లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ప్రియతముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, ఆస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. సహోద్యోగుల సహకారం లో పించడంతో లక్ష్య సాధనలో అసౌకర్యానికి లోనవుతారు. సేవాకార్యక్రమంలో పాల్గొంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన, ఆడిటింగ్, గార్మెంట్స్ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. శ్రీలలితా దేవి ఆరాధన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో వున్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. కనకదారా స్తోత్ర పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
కమ్యూనికేషన్ రంగంలోని వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ప్రియతముల ఆరోగ్యం కొంత ఆవేదన కలిగిస్తుంది. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. కనకధారాస్తోత్ర పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. ఆదాయం పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపార రంగంలోని వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. లలితాదేవి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. తలపెట్టిన మనులు వాయిదా పడటంతో మనసు చికాకుగా ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా వుంటుంది. మనసు ఉల్లాసంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్యూలకు హాజరవుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని రీతిలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ దుర్గామాత ఆరాధన శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్, ప్రకటనలు, ట్రావెల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సాంత్వన లభిస్తుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ