Zodiac Signs: ఆ రాశి వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అనుకూలం!
ABN , Publish Date - Apr 01 , 2024 | 06:51 AM
నేడు (1-4-2024 - సోమవారం) సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి...
నేడు (1-4-2024 - సోమవారం) సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి...
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి అనుకున్న పనులు సాధిస్తారు. బందుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, ఔషధాలు, స్టీల్, రిపేర్ల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
జనసంబధాలు విస్తరిస్తాయి. సమావేశాలు, ప్రదర్శనల్లో పాల్గొంటారు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి నిధులు సర్దుబాటవుతాయి. వేడుకల్లో పాల్గొంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
మీ అంచనాలు ఫలిస్తాయి. క్రీడలు, కన్సల్టెన్సీలు, అడ్వర్టయిజ్మెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి శుభవార్త అందుకుంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహరుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆోగ్యంపై దృష్టి సారిస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. చర్చలు, సమావేశాలు, ప్రయాణాలు ఫలిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం ల భిస్తుంది. మెడికల్ క్లెయములు మంజూరవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడాతాయి. ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న ప్రియతముల రాక ఆనందం కలిగిస్తుంది. గృహారంభ ప్రవేశాలకు అనుకూలం. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాఽధిస్తారు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. కీలకమైన పదవులు అందుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ