zodiac signs: ఈ రాశివారికి నూతన ప్రారంభాలు అనుకూలం
ABN , Publish Date - Apr 09 , 2024 | 07:33 AM
రాశిఫలాలు 09-04.2024 మంగళవారం కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
రాశిఫలాలు
09-04.2024 మంగళవారం కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
నూతన ప్రారంభాలకు అనుకూలమైన రోజు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థికపరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెద్దలు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ, బోధన, రవాణా, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బకాయిలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానధర్మాలకు వెచ్చిస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, ఆస్పత్రులు, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. మీ లోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు ల భిస్తుంది. టెలివిజన్, క్రీడలు, అడ్వర్టయిజ్మెంట్, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ , నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహనిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
శుభవార్త అందుకుంటారు. తోబుట్టువులతో ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. వాహనం కొనుగోలుకు అనుకూల సమయం. చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన నిధులు సకాలంలో చేతికి అందుతాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ