Share News

Indian Navy: నేవీ రిక్రూట్‌మెంట్.. ఇంటర్ చదివిన విద్యార్థులకు మంచి అవకాశం

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:24 PM

టెన్ ప్లస్ టూ(బీ టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేరేందుకు నావికాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Indian Navy: నేవీ రిక్రూట్‌మెంట్.. ఇంటర్ చదివిన విద్యార్థులకు మంచి అవకాశం

Navy Recruitment: టెన్ ప్లస్ టూ(బీ టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేరేందుకు నావికాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లను ఎంపిక చేసి ఎస్ఎస్‌బీ బోర్డులో ఉత్తీర్ణత సాధించిన వారికి కోర్సులోకి తీసుకుంటారు. జనవరి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు joinindiannavy.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.

  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

  • వయోపరిమితి: 2005 జనవరి 2, 01 జులై 2007 మధ్య పుట్టిన వారు ఈ పరీక్షకు అర్హులు

  • ఎన్‌టీఏ 2023 జేఈఈ సీఆర్ఎల్ ర్యాంకుల అధారంగా కాల్-అప్ ఉంటుంది.

దారఖాస్తు ఇలా..

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. ఆ తరువాత దరఖాస్తు కన్ఫర్మేషన్ పేజీని ప్రింటౌట్ తీసుకోవాలి. ఎంపిక చేసిన అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంలో మార్చి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Updated Date - Jan 05 , 2024 | 05:29 PM