SAATHI: గుడ్ న్యూస్.. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్
ABN , Publish Date - Oct 20 , 2024 | 08:10 PM
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. ఐఐటీ జేఈఈ, నీట్, బ్యాకింగ్, ఎస్ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ‘ఫ్రీ సాథీ పోర్టల్ 2024’ ను ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. ఐఐటీ జేఈఈ, నీట్, బ్యాకింగ్, ఎస్ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ‘ఫ్రీ సాథీ పోర్టల్ 2024’ ను ప్రారంభించింది. నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ పోర్టల్‌లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి వీడియో పాఠాలు, మాక్ టెస్టులు, నిపుణుల గైడెన్స్ అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే విధంగా వివిధ భాషల్లో వీటిని ఎన్‌సీఈఆర్‌టీ అందుబాటులోకి తెచ్చింది (Saathi Portal).
RRB NTPC Recruitment 2024: 8000 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ - 2020లో భాగంగా నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉచిత స్టడీ మెటీరియల్, లెసెన్స్‌ను సాథీ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ఈ పోర్టల్‌లో సుమారు 4.37 లక్షల విద్యార్థులు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు.
IRCTC Recruitment 2024: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2 లక్షల వరకు జీతం..!
ఎన్‌సీఈఆర్‌టీ సాథీ పోర్టల్..
ముందుగా విద్యార్థులు సాథీ పోర్టల్‌లో తన పేరు, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత మెడిసిన్, ఇంజినీరింగ్, ఎస్ఎస్‌సీ తదితర కోర్సులకు సంబంధించి స్టడీ మెటీరియల్ ఉచితంగా పొందొచ్చు. ఎన్‌సీఈఆర్ టీ బుక్స్‌లోని ప్రశ్నలు, వీడియోలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాలను డీటీహెచ్ ఛానల్స్ ద్వారా అందించేందుకు కూడా ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సహాయం కోసం ఏఐ ఆధారిత చాట్‌బాట్ కూడా అందుబాటులో ఉంటుందని ఎన్‌సీఈఆర్‌టీ చెప్పింది.
For More Education News and Telugu News..