Share News

APPLE : ఐఫోన్‌, ఐపాడ్‌లో ఐ ట్రాకింగ్‌

ABN , Publish Date - May 18 , 2024 | 12:17 AM

యాపిల్‌ - ఐఫోన్‌, ఐపాడ్‌లలో సరికొత్త ఫీచర్‌ ‘ఐ ట్రాకింగ్‌’ను తీసుకువస్తోంది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ సామర్ధ్యాల సహాయంతో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఐఫోన్‌, ఐపాడ్‌ల్లోని ఫ్రంట్‌ కెమెరా యూజర్‌ కళ్ళను ఫాలో అవుతుంది.

APPLE : ఐఫోన్‌, ఐపాడ్‌లో  ఐ ట్రాకింగ్‌

యాపిల్‌ - ఐఫోన్‌, ఐపాడ్‌లలో సరికొత్త ఫీచర్‌ ‘ఐ ట్రాకింగ్‌’ను తీసుకువస్తోంది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ సామర్ధ్యాల సహాయంతో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఐఫోన్‌, ఐపాడ్‌ల్లోని ఫ్రంట్‌ కెమెరా యూజర్‌ కళ్ళను ఫాలో అవుతుంది. తద్వారా సెట్టింగ్స్‌ అలాగే యాప్స్‌ పెద్ద ఇబ్బంది లేకుండా యూజర్‌ నేవిగేట్‌ చేసుకోవచ్చు. .

ఫిజికల్‌ బటన్స్‌ వంటివి కూడా ఉపయోగించవచ్చు. డ్వెల్‌ కంట్రోల్‌ ఫీచర్‌ ఈ విషయంలో సహాయపడుతుంది. కంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లు సరిగ్గా చూసుకుని పనిచేసుకునేందుకు వీలుగా గతంలో ప్రత్యేక యాక్సెసరీలను కొనుగోలు చేసుకునే వారు.

ఇప్పుడు వారికి ఆ ఇబ్బంది ఉండదు. మ్యూజిక్‌ హెపటిక్స్‌ మరొకటి. ఐఓఎస్‌ అప్డేట్‌తో ఐఫోన్‌లోకి వస్తోంది. వినికిడి లోపం ఉన్న వారు, వినడానికి చాలా ఇబ్బంది పడుతున్న యూజర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.


యూజర్‌ సంగీతం వింటున్నప్పుడు మ్యూజిక్‌కు అనుగుణంగా ట్యాప్స్‌, టెక్స్‌ట్యూర్స్‌ని టాప్టిక్‌ ఇంజన్‌ ప్లే చేస్తుంది. అలాగే ఐఫోన్‌, ఐపాడ్‌ మధ్య వోకల్‌ షార్ట్‌కట్స్‌ను కూడా యాపిల్‌ తీసుకువస్తోంది.

‘సిరి’ సేవలు పొందడానికి తోడు పలు క్లిష్టమైన టాస్క్‌ల పూర్తికి అది ఉపయోగపడుతుంది. స్పీచ్‌ రికగ్నిషన్‌ మరొకటి. ఇబ్బందుల కారణంగా స్పీచ్‌ సరిగ్గా లేకుంటే వినడానికి వీలుగా ఇది మలుస్తుంది.

కదులుతున్న వాహనాల్లో ప్రయాణికులకు ఎదురయ్యే మోషన్‌ సిక్‌నెస్‌ను తగ్గించేందుకు వెహికల్‌ మోషన్‌ క్యూస్‌ ఫీచర్‌ పనికొస్తుంది. వాహనాల్లోని కార్‌ ప్లే ఫీచర్‌కు మొదటిసారి వాయిస్‌ కంట్రోల్‌ని యాపిల్‌ తెస్తోంది.

Updated Date - May 18 , 2024 | 12:17 AM