Apple Company : 37.40 కోట్ల అకౌంట్స్ బ్లాక్
ABN , Publish Date - May 18 , 2024 | 12:36 AM
యాపిల్ ప్రత్యేకించి 37.40 కోట ్ల మేర అకౌంట్లను గత ఏడాది బ్లాక్ చేసింది. ఇందులో డెవలపర్, కస్టమర్ అకౌంట్లు ఉన్నాయని యాపిల్ ఒక నివేదికలో తెలిపింది.
యాపిల్ ప్రత్యేకించి 37.40 కోట ్ల మేర అకౌంట్లను గత ఏడాది బ్లాక్ చేసింది. ఇందులో డెవలపర్, కస్టమర్ అకౌంట్లు ఉన్నాయని యాపిల్ ఒక నివేదికలో తెలిపింది. తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఒక్క 2023లోనే ఒకటిన్నర కోట్లకు పైగా రేటింగ్స్, రివ్యూలను కూడా తొలగించింది.
పైరేట్ స్టోర్‌ఫ్రంట్స్‌లో 47000 బ్లాక్ చేసింది. ఒక్క ఏడాదిలో 1.8 బిలియన్ల డాలర్ల మేర అక్రమాలకు చెక్ పెట్టింది. 2020 నుంచి చూసుకుంటే అది ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది. యాప్ స్టోర్ టీమ్‌లో 500 మంది సభ్యులు ఉన్నారు. వారానికి 1,32,500 యాప్‌లను వారు రెవ్యూ చేస్తారు. గత ఒక్క ఏడాదిలో 6.9 కోట్ల మేర యాప్ దరఖాస్తులను సమీక్షించింది. వడపోత అనంతరం 1,92,000 యాప్స్‌కు మాత్రమే అనుమతిచ్చింది. మొత్తమ్మీద అకౌంట్స్, యాప్స్ విషయంలో స్ర్కూటినీని పటిష్టపరుస్తోంది.