Share News

Kidney problems : హోమియోతో మూత్రపిండాల మరమ్మతు

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:14 AM

డాక్టర్‌! మూత్రపిండాల సమస్యలకు హోమియోపతిలో పరిష్కార మార్గాలున్నాయా? అల్లోపతి మందులు వాడుకుంటూ, హోమియో మందులు కూడా వాడుకోవచ్చా?

Kidney problems : హోమియోతో మూత్రపిండాల మరమ్మతు

డాక్టర్‌! మూత్రపిండాల సమస్యలకు హోమియోపతిలో పరిష్కార మార్గాలున్నాయా? అల్లోపతి మందులు వాడుకుంటూ, హోమియో మందులు కూడా వాడుకోవచ్చా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలియగానే, ఇక జీవితమంతా డయాలసిస్‌తోనే గడపాలనేది చాలా మంది భావన. క్రియాటిన్‌ నిల్వలు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు తాత్కాలికంగా డయాలిసిస్‌ అవసరమే కావచ్చు. కానీ, హోమియోపతిని ఆశ్రయిస్తే, ఎప్పటికీ డయాలసిస్‌ మీదే ఆధారపడవలసిన అవసరం ఉండదు. దెబ్బతిన్న కిడ్నీలను మళ్లీ నార్మల్‌ స్థితికి తీసుకు వచ్చే వైద్య చికిత్సలు హోమియోపతిలో ఉన్నాయి. ముఖ్యంగా, క్రియాటిన్‌ నిల్వలు పెరిగిన విషయాన్ని ముందే గమనించి వెంటనే వైద్య చికిత్సలు తీసుకుంటే, ఆ నిల్వలు, ఇంకా పెరగకుండా ఆగడంతో పాటు మూత్రపిండాల పనితీరు తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలుంటాయి.

విషమించినప్పుడు?

పరిస్థితి డయాలసిస్‌కు దారి తీయడానికి నెఫ్రాన్లు దెబ్బతినడమే కారణం కాబట్టి, హోమియో చికిత్సతో నెఫ్రాన్లను రిపేర్‌ చేయడం ద్వారా, కిడ్నీలను పూర్వస్థితికి తీసుకురావచ్చు. అయితే కిడ్నీలు అప్పటికే 70 లేదా 80 శాతానికి మించి పాడైపోయి ఉంటే, డయాలసిస్‌ తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు డయాలసిస్‌ చేయించుకుంటూనే హోమియో మందులు తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల డయాలసిస్‌తో ఎదురయ్యే దుష్ప్రభావాలు బాగా తగ్గుతాయి. దీనికి తోడు డయాలసిస్‌కూ డయాలసిస్‌కూ మధ్య ఉండే కాలవ్యవధి కూడా పెరుగుతుంది.

తగు జాగ్రత్తలతో...

క్రియాటిన్‌ నిల్వలు 7, 8కి చేరుకున్నప్పటికీ, హోమియో చికిత్సతో నార్మల్‌ స్థితికి వచ్చిన వాళ్లున్నారు. అయితే ఆ ఫలితం వైద్యులతో పాటు రోగి మీద కూడా ఆధారపడి ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బ తిన్న వాళ్లు నిరంతరం వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఆహారశైలి, జీవన శైలి నియమాలను కచ్చితంగా పాటించాలి. ఏ ఆహార పదార్థాలతో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలుంటాయో తెలుసుకోవడానికి డైటీషియన్‌ సలహలూ, సూచనలూ తీసుకోవడం కూడా అవసరమే!

- డాక్టర్‌ ఎస్‌. రామ్మోహన్‌ రెడ్డి

హోమియో ఫిజీషియన్‌, హైదరాబాద్‌.

Updated Date - Jun 06 , 2024 | 05:14 AM