Favorite Lipstick: లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..!
ABN , Publish Date - Jun 11 , 2024 | 01:36 PM
పెదవుల అందం కోసం ఆడవారు ఎంచుకునే ఈ లిప్ కలర్స్ గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలుసుకోవాలి. మనం పెదవులకు ఎలాంటి కలర్ ఎంచుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట.
లిప్ స్టిక్ పెదవుల అందాన్ని పెంచే అందమైన ప్రోడెక్ట్.. దీనిని పెదవులకు పూసుకోవడం వల్ల పెదవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అధరాల అందాన్ని పెంచుకోవాలనుకునే యువతులంతా రకరకాల బ్రాండ్స్, రకరకాల కలర్స్ వైపు మొగ్గుచూపుతూ ఉంటారు. అయితే పెదవుల అందం కోసం ఆడవారు ఎంచుకునే ఈ లిప్ కలర్స్ గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలుసుకోవాలి. మనం పెదవులకు ఎలాంటి కలర్ ఎంచుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట. అదెలాగంటే..
పెదవులకు ఎంచుకునే రంగులు..
లైట్ పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకునే మహిళల విషయానికి వస్తే.. క్లాసిక్ లుక్ తో పాటు డిగ్నిటీ కోరుకుంటారు. వీరిలో జాలి, దయ ఎక్కువ. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.
పింక్ కలర్ లిప్ స్టిక్ వేసకునే వారిలో మనర్జిటిక్‌గా కనిపిస్తారు. చిన్న పిల్లల అమాయకత్వం ఉంటుంది. అందరినీ నవ్విస్తారు. ఇలాంటి వారిని అబ్బాయిలు ఇట్టే ఇష్టపడతారు.
బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ వేసుకునే ఆడవారు ప్రతిభావంతులుగా ఉంటారు. మాటకారి తనంతో నెగ్గుకు వచ్చే మనస్తత్వంతో ఉంటారు.
రెడ్ కలర్ లిప్ స్టిక్ ధైర్యం, నమ్మకం కలిగిస్తుంది. ఈ కలర్ లిప్ స్టిక్ వేసుకుంటే ఆకర్షణీయంగా, నమ్మకంగా కనిపిస్తారు.
Black salt : నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా? ఈ నీటిని తాగితే..
పింక్ కలర్.. ఇది ఎనర్జిటిక్ గా ఉంటారు. బబ్లీ నేచర్ ఉంటుంది. అమాయకంగా కనిపిస్తారు. సాహసోపేతమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
బ్రౌన్ లిప్ స్టిక్..బలమైన, నమ్మకమైన మనస్తత్వంతో ఉంటారు. భావోద్వేగాలను అణుచుకునే వారు.
Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా వదిలించుకోవాలి. ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం ఉందా?
పెదవులకు రంగు పూసుకునే వారితో పోల్చితే.. లిప్ స్టిక్ వేసుకోని వారు ఎలా ఉంటారంటే..సహజమైన పెదవులని కలిగిన స్త్రీలు గందరగోళానికి గురికాకుండా ఉంటారు.
నిగనిగలాడే పెదవులకు రంగు వేసుకోవడం ఇష్టం లేనివారు షైన్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో లిప్ గ్లాస్ వాడతారు వీరు కాస్త చురుకైన బలమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.