మార్కెటింగ్ మెసేజెస్ బ్లాకింగ్ ఇలా
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:55 PM
వాట్సాప్ ద్వారా బిజినెస్ ప్రమోషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. భారత దేశానికి చెందిన పలు వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్ యూజర్లు తమ యాప్ తెరిస్తే చాలు, సదరు మెసేజ్‌లతో బాక్స్‌లు నిండుతున్నాయి. వాటిని తొలగించుకోవడం నిజానికి పెద్ద పని
వాట్సాప్ ద్వారా బిజినెస్ ప్రమోషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. భారత దేశానికి చెందిన పలు వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్ యూజర్లు తమ యాప్ తెరిస్తే చాలు, సదరు మెసేజ్‌లతో బాక్స్‌లు నిండుతున్నాయి. వాటిని తొలగించుకోవడం నిజానికి పెద్ద పని. సమయం కూడా వృథా అవుతుంది. ప్రభుత్వం సైతం వీటిని అరికట్టే యత్నాల్లోనే ఉంది. వాట్సాప్ ఈ రోజుల్లో ఒక మంచి కమ్యూనికేషన్ సాధనం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ప్రయాణాలకు సంబంధించి టికెట్స్ నుంచి ఎంతో విలువైన సమాచారాన్ని స్టోర్ చేసుకునేందుకు వాట్సాప్ ఉపయోగపడుతోంది. అయితే మధ్యలో ఈ బిజినెస్ మెసేజ్‌లు యూజర్లకు చాలా చిరాకు కలిగిస్తున్నాయి. వాటిని నిరోధించేందుకు ముఖ్యంగా....
కాంటాక్ట్ లిస్టు నుంచి బ్లాక్ చేయడం ఒక పద్ధతి. ఒకసారి బ్లాక్ చేస్తే వ్యాపార సముదాయాలు తమ ప్రచారాన్ని పంపలేవు. అయితే వాటి బిజినెస్ ప్రొపైల్, కేటలాగ్స్‌లో ఆ సంస్థలకు సదరు నంబర్ల యాక్సెస్ మాత్రం ఉంటుంది.
యూజర్లకు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు అనుకుంటే యూజర్లు ఆ పని చేయవచ్చు.
అదే మాదిరిగా యూజర్లకు కంటిన్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. సదరు వ్యాపార సంస్థతో సంబంధాలను మెయింటైన్ చేయవచ్చు. బిజినెస్ సంస్థలతో మెసేజింగ్‌కు చొరవ కూడా చూపించవచ్చు.
కొన్ని సంస్థలు మాత్రం తమ ప్రచారం వద్దనుకుంటే డిక్లెయిన్‌ని ఎంచుకునే అవకాశాన్ని యూజర్లకు ఇస్తాయి. యూజర్ దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు, తమ జాబితా నుంచి సదరు వ్యక్తిని ఆ వ్యాపార సంస్థ తొలగిస్తాయి. ఈ ఫీచర్ లేకుంటే బ్లాక్ చేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు.