Family planning : కుటుంబ నియంత్రణ ఇలా...
ABN , Publish Date - Aug 12 , 2024 | 11:20 PM
సురక్షితమైన కుటుంబనియంత్రణ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో దేన్ని ఉంచుకోవాలనే విషయంలో అయోమయాలుంటాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు తగిన కుటుంబనియంత్రణ
సురక్షితమైన కుటుంబనియంత్రణ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో దేన్ని ఉంచుకోవాలనే విషయంలో అయోమయాలుంటాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు తగిన కుటుంబనియంత్రణ పద్ధతిని ఎంచుకోవడంతో పాటు, ఈ కింది విషయాల పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి.
ఎంత వ్యవధిలో మీకు తల్లి కావాలనే ఉద్దేశం ఉంది?
ఒక్కో కుటుంబనియంత్రణ పద్ధతి సామర్ధ్యం ఎంత?
దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా?
మీరెంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటారు?
ఏ పద్ధతి మీ ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది?
ఎంతో సమర్థమైన కుటుంబనియంత్రణ పద్ధతులు కూడా ఒక్కోసారి ఫెయిలవుతూ ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చే అవకాశాలను సమర్థంగా అడ్డుకునే పద్ధతిని ఎంచుకోవాలి.
కుటుంబ నియంత్రణ పద్ధతులు:
ఫిమేల్ అండ్ మేల్ స్టెరిలైజేషన్: సర్జరీ ద్వారా శాశ్వతంగా గర్భం రాకుండా చేయవచ్చు.
లాంగ్ యాక్టింగ్ రివర్సిబుల్ కాంట్రాసెప్టివ్స్: ఈ విధానంలో శరీరం లోపల అమర్చే పరికరం ద్వారా 3 నుంచి పదేళ్లపాటు గర్భం రాకుండా నియంత్రించవచ్చు. పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆ పరికరాన్ని తీసేయొచ్చు.
షార్ట్ యాక్టింగ్ హార్మోనల్ మెథడ్స్: మాత్రలు, మినీ పిల్స్, ప్యాచ్, షాట్, వెజైనల్ రింగ్ - వీటి ద్వారా గర్భధారణను అడ్డుకోవచ్చు. షాట్‌ను ప్రతి మూడు నెలలకూ తీసుకోవాలి. మాత్రలు, వెజైనల్ రింగ్ ప్రతి రోజూ వాడాలి.
బ్యారియర్ మెథడ్స్: కండోమ్స్, డయాఫ్రమ్, స్పాంజ్, సర్వికల్ క్యాప్ - వీటిని లైంగికంగా కలిసే ప్రతిసారీ వాడాలి.
న్యాచురల్ రిథమ్ మెథడ్స్: ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులూ పాటించకుండా అండాలు విడుదల కాని సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఈ రోజులను కచ్చితంగా గుర్తించడం కోసం ఓవ్యులేషన్ హోమ్ టెస్ట్ కిట్ లేదా ఫర్టిలిటీ మానిటర్‌లను ఉపయోగించాలి. అయితే, ఉజ్జాయింపు లెక్కలతో పాటించే ఈ విధానం ఫెయిలయ్యే అవకాశాలూ ఎక్కువే!