Technology : సెక్యూరిటీ లూప్‌హోల్!
ABN , Publish Date - Jun 22 , 2024 | 01:04 AM
గూగుల్ - పీసీలపై ఉండే క్రోమ్ బ్రౌజర్‌లో భద్రతపరమైన లోపాలు తలెత్తాయని, రాబోయే రోజుల్లో సరికొత్త అప్డేట్‌తో వాటన్నింటినీ పరిష్కరిస్తామని ప్రకటించింది.
గూగుల్ - పీసీలపై ఉండే క్రోమ్ బ్రౌజర్‌లో భద్రతపరమైన లోపాలు తలెత్తాయని, రాబోయే రోజుల్లో సరికొత్త అప్డేట్‌తో వాటన్నింటినీ పరిష్కరిస్తామని ప్రకటించింది. సెక్యూరిటీ సమస్యలకు వీలున్న వాటిని మొదట ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ) గుర్తించింది. విండోస్ పీసీలు, లినక్స్, మేక్ కంప్యూటర్స్‌లో ఉన్నట్టు కనుగొన్నారు. వి8లో టైప్ కన్ఫ్యూజన్, వెబ్‌అసెంబ్లీ అమలులో అవకతవకలు, డాన్ సంబంధ సమస్యల ఫలితమే ఇది అని సీఈఆర్‌టీ తేల్చింది. గూగుల్ వీటికి అంగీకరించడానికి తోడు తదనుగుణ చర్యలు తీసుకుంటోంది. రిలీజ్ చేయబోయే అప్డేట్స్‌ను కూడా వెల్లడించింది. ఈలోపు గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లోనూ సంబంధిత సమస్యలను కనుగొన్నారు. లక్షిత డివైజ్‌లను టార్గెట్ చేస్తూ ఇప్పటికే రిమోట్ హేకర్ ఒకరు యత్నించారు. సులువుగా డివైజ్‌పై పట్టు సాధించాడు. డినయల్ ఆఫ్ సర్వీస్(సర్వీస్ తిరస్కరణ) అటాక్‌ను కూడా నిర్వర్తించాడు.