జెమినీ నానోతో ఫ్రాడ్‌కాల్స్ అలర్ట్
ABN , Publish Date - May 18 , 2024 | 12:45 AM
గూగుల్ - ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం జెమినీ నానో - ‘పవర్డ్ స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్’ను పరిచయం చేస్తోంది. మోసపూరిత భాష, సంబంధిత సంభాషణలను జాగ్రత్తగా ఇది విశ్లేషిస్తుంది.
గూగుల్ - ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం జెమినీ నానో - ‘పవర్డ్ స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్’ను పరిచయం చేస్తోంది. మోసపూరిత భాష, సంబంధిత సంభాషణలను జాగ్రత్తగా ఇది విశ్లేషిస్తుంది. తద్వారా మోసగాళ్ళను గుర్తిస్తుంది.
అలాగే ఆ సంభాషణ కొనసాగిస్తున్న సమయంలోనే యూజర్‌ని అలెర్ట్ చేస్తుంది. సంబంధిత వీడియోతో డిమాన్‌స్ట్రేషన్స్‌ను సైతం గూగుల్ ఏర్పాటు చేసింది. సేఫ్టీ ఫీచర్ ఎలా పని చేస్తుందో తద్వారా తెలియజేసింది.
సంభాషణలను ఈ ఫీచర్ మానిటర్ చేస్తుంది. అదే సమయంలో సంభాషణలు ఎన్‌క్రిప్ట్ అవుతాయి. తద్వారా ఇదంతా ప్రైవేట్ వ్యవహారంగా ఉంటుంది.
అయితే ఈ ఫీచర్ ఎప్పటికి యూజర్లకు అందుబాటులోకి వస్తుందన్న విషయం మాత్రం గూగుల్ తెలియజేయలేదు. ఈ ఏడాది చివర్లో విషయం బైటకు రావచ్చు. పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లలో ప్రస్తుతం జెమినీ నానీ పనిచేస్తోంది.