Share News

జిప్సీ జోరు

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:28 AM

కాస్త డిఫెరెంట్‌గా, మరికాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే జిప్సీ స్టైల్స్‌ ఫాలో కావాలి. స్కర్ట్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌, లేయర్‌ ఫ్రాక్స్‌... ఇలా జిప్సీలో బోలెడన్ని డ్రస్‌లు ఉన్నాయి. అవే ఇవి!...

జిప్సీ జోరు

ఫ్యాషన్‌

కాస్త డిఫెరెంట్‌గా, మరికాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే జిప్సీ స్టైల్స్‌ ఫాలో కావాలి. స్కర్ట్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌, లేయర్‌ ఫ్రాక్స్‌... ఇలా జిప్సీలో బోలెడన్ని డ్రస్‌లు ఉన్నాయి. అవే ఇవి!

జామెట్రీ, ఫ్లవర్‌, ఈజిప్షియన్‌... ఇలా ఎన్నో రకాల ప్రింట్లు జిప్సీ స్కర్ట్స్‌ సొంతం. ఈ డిజైన్లన్నీ దగ్గర దగ్గరగా ఇరికించినట్టు ఉండడం జిప్సీ స్టైల్‌ ప్రత్యేకత!

ఈ డిజైన్నన్నీ ముదురు రంగుల్లో, ఓ క్రమం లేకుండా డ్రస్‌లో ఒదిగిపోయి ఉండడమే

ఈ దుస్తులకు ఉన్న ఎట్రాక్షన్‌!

పెన్సిల్‌ హీల్స్‌, బూట్స్‌, వెడ్జెస్‌, ఫ్లాట్స్‌.... వీటిలో ఎలాంటి చెప్పులైనా జిప్సీ దుస్తులతో మ్యాచ్‌ అవుతాయి. అలాగే పెద్ద సైజు ఇయర్‌ హ్యాంగింగ్స్‌, బ్యాంగిల్స్‌, హెడ్‌ బ్యాండ్స్‌ ఈ దుస్తులకు మ్యాచ్‌ అయినంతగా మరే డ్రస్‌కూ మ్యాచ్‌ అవవు!

క్రాప్‌ టాప్స్‌, స్లీవ్‌లెస్‌, షర్ట్‌.... ఇలా ఎలాంటి టాప్స్‌ అయినా జిప్సీలో చెల్లుబాటు అవుతాయి. డిజైన్‌ పరంగా టాప్‌, బాటమ్‌ మ్యాచ్‌ కావాలనే నియమం కూడా ఉండదు. కాబట్టే జిప్సీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ సర్వత్రా ఆదరణ పొందుతోంది.

Updated Date - Jul 03 , 2024 | 02:28 AM