Share News

మేని మెరుపులకు...

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:00 PM

తెల్లని చర్మం కోసం తయారవుతున్న లోషన్లు, క్రీముల్లో రసాయనాలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే! వాటితో దుష్ప్రభావాలకు గురవకుండా ఉండటానికి సహజసిద్ధ చిట్కాలున్నాయి. అవే ఇవి...

మేని మెరుపులకు...

తెల్లని చర్మం కోసం తయారవుతున్న లోషన్లు, క్రీముల్లో రసాయనాలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే! వాటితో దుష్ప్రభావాలకు గురవకుండా ఉండటానికి సహజసిద్ధ చిట్కాలున్నాయి. అవే ఇవి...

ఎండలోకి వెళ్లేటప్పుడు చర్మాన్ని కప్పి ఉంచాలి. ఇందుకోసం స్కార్ఫ్‌ వాడుకోవాలి. ద్విచక్ర వాహనాలను నడిపేవాళ్లు తప్పనిసరిగా స్కార్ఫ్‌, హెల్మెట్‌ వాడుకోవాలి.

  • రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.

  • 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.

  • తాజా పళ్ల రసాలు, ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి.

  • వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి.

  • చక్కెర వాడకం తగ్గించాలి.

  • 16 ఏళ్ల లోపు యువతులు ఎలాంటి సౌందర్య సాధనాలూ వాడకూడదు.

  • ఇంట్లో తయారు చేసుకుని వేసుకునే ప్యాక్స్‌ వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది.

  • చర్మానికి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా సొంత వైద్యం మాని చర్మ వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Nov 09 , 2024 | 11:01 PM