Share News

ఈ రాశుల వారికి నేడు చాలా ఇబ్బందే...

ABN , Publish Date - Feb 20 , 2024 | 08:10 AM

నేడు (20-02-2024 మంగళవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...

ఈ రాశుల వారికి నేడు చాలా ఇబ్బందే...

నేడు (20-02-2024 మంగళవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. బదిలీలు, మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులుకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. మార్కెటింగ్‌, రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దలు, పైఅధికారుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. వారసత్వ విషయాలు పరిష్కారం అవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండండి ఖ ర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆ రోగ్యంమెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ సంస్థల వారికి అనుకూల సమయం. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయాలో కొంత నిరాశ తప్పకపోవచ్చు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రవాణా, రక్షణ, బోధన, న్యాయ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బీమా, పెన్షన్‌ పనులు పూర్తవుతాయి. పన్నుల విషయాలపై దృష్టి పెడతారు. గృహరుణాలు మంజూరు కావడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామితో చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం పాటించడం అవసరం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. హోటల్‌, రిటైల్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతలము వైఖరి ఉ ల్లాసం కలిగిస్తుంది. క్రీడలు, విద్య, చిట్‌ఫండ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Feb 20 , 2024 | 08:10 AM