Horoscope Today: ఈ ఒక్క రాశి వారికే ఇన్ని శుభవార్తలా.. ఆలస్యమెందుకు చెక్ చేసుకోండి!
ABN , Publish Date - Feb 29 , 2024 | 07:44 AM
నేడు(29-2-2024 గురువారం) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
నేడు(29-2-2024 గురువారం)
కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహకరంగా వుంటుంది. బీమా, పన్నులు, మ్యూచ్యువల్ ఫండ్‌ల గురించి ఆరా తీస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాల్లో, వేడుకల్లో గౌరమ, మన్ననలు అందుకంటారు.వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం వరిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయదారులు, పారిశ్రామికవేత ్తలు లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, హోటల్, క్యాటరింగ్, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. విందుల్లో పాల్గొంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిట్‌ఫండ్‌లు, బోధన, బ్యాంకింగ్, ప్రకటనల రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సృజనాత్మక రంగాల వారికి అనుకూల సమయం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల విషయంలో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దత్తకవచ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఏజెన్సీలు, మార్కెటింగ్, బోధన, రవాణా రంగాల వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. గాయత్రీ మాతను ఆరాధించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు. బ్యాంకులు ఆర్థిక సంస్థల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. దత్త కవచ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. మీలోని సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథ కాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. దూరంతో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వుస్తువులు సమకూర్చుకుంటారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విలువైన పత్రాలు అందుకుంటారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పదిమందిలో గౌరవ, మన్ననలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉన్నత పదవుల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు లాభిస్తాయి. అదనపు ఆదాయం లభిస్తుంది. సాయిబాబా ఆరాదన శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకర సమయం. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చర్చలకు అనుకూలం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ