Share News

Oppo : ట్రిపుల్‌ ఐపీ రేటింగ్స్‌తో ఒప్పో స్మార్ట్‌ ఫోన్‌

ABN , Publish Date - Jun 28 , 2024 | 11:59 PM

ఒప్పో నుంచి ట్రిపుల్‌ ఐపీ రేటింగ్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ఒకటి వస్తోంది. ‘ఒప్పో ఎఫ్‌27 ప్రొ ప్లస్‌ 5జి’ పేరిట ఇది విడుదల అవుతోంది. ట్రిపుల్‌ అంటే ఐపీ69, ఐపీ 68 ఐపీ 66 ఎలా, ఏ స్థాయిలో మెరుగైనవి అన్నది మొదటి చూడాలి. హై ఎండ్‌ అలాగే మిడ్‌ రేంజ్‌ ఫోన్లు ఈ మధ్య ఐపీ

Oppo  : ట్రిపుల్‌ ఐపీ రేటింగ్స్‌తో ఒప్పో స్మార్ట్‌ ఫోన్‌

ఒప్పో నుంచి ట్రిపుల్‌ ఐపీ రేటింగ్స్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ఒకటి వస్తోంది. ‘ఒప్పో ఎఫ్‌27 ప్రొ ప్లస్‌ 5జి’ పేరిట ఇది విడుదల అవుతోంది. ట్రిపుల్‌ అంటే ఐపీ69, ఐపీ 68 ఐపీ 66 ఎలా, ఏ స్థాయిలో మెరుగైనవి అన్నది మొదటి చూడాలి. హై ఎండ్‌ అలాగే మిడ్‌ రేంజ్‌ ఫోన్లు ఈ మధ్య ఐపీ రేటింగ్స్‌తో వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒప్పో తాజా ఫోన్‌ ఆ మూడు రేటింగ్స్‌తో రిలీజ్‌ అవుతోంది. అసలీ నంబర్ల వ్యవహారం ఏమిటంటే...

  • ఐపీ 69 డివైజ్‌ అంటే డస్ట్‌ - సీల్డ్‌. హై ప్రెజర్‌, హై టెంపరేచర్‌ వాటర్‌ జెట్స్‌ను తట్టుకోగలదు. ప్రొటక్షన్‌కు సంబంధించి ఇదే అత్యున్నతం. తీవ్ర పరిస్థితుల నుంచి కూడా బైటపడగలదు. ఇండస్ట్రియల్‌ క్లీనింగ్‌ ప్రాసెసస్‌, కఠినమైన బైటి వాతావరణ పరిస్థితులను భరించగలదు.

  • ఐపీ68... ఇది కూడా డస్ట్‌-సీల్డ్‌. అయితే నీటి విషయంలో ఒక మీటరు లోతుకు మించకూడదు. పూల్స్‌, నదులు దగ్గర్లో పడినా ఇబ్బంది ఉండదు.

  • ఐపీ66 కూడా డస్ట్‌ విషయంలో ఒకే విధంగా ఉంటుంది. శక్తిమంతమైన వాటర్‌ జెట్స్‌, స్ర్పేలను తట్టుకోగలదు.

  • దరిమిలా ఒప్పో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విషయానికి వస్తే ట్రిపుల్‌ రేటింగ్‌ ఉన్నందున దాదాపుగా అన్ని విధాలుగా యోగ్యమైనదిగా చెప్పవచ్చు. హై ఇంటెన్సిటీతో పైనుంచి కిందకు నీరు పడుతున్నా ఇబ్బంది ఉండదు. మందు పేర్కొన్నట్టు ఒక్కో రేటింగ్‌తో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలా చూసుకున్నప్పుడు ఈ మూడు రేటింగ్‌లు ఉన్న కొత్త ఫోన్‌ ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించగలదని చెప్పవచ్చు.

Updated Date - Jun 28 , 2024 | 11:59 PM