Best Road Trips: చలికాలం వచ్చేసింది.. ఫ్రెండ్స్‌తో రోడ్ ట్రిప్స్ వేసేవారికి ది బెస్ట్ రూట్స్ ఇవే
ABN , Publish Date - Nov 01 , 2024 | 02:14 PM
మన దేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు శీతాకాలం మంచిఅనువైన సమయం. చల్లటి వాతావరణం, కనువిందు చేసే దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇలాంటి యాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయతాయి. మరి మీరు కూడా ఈ సీతాకాలంలో రోడ్ ట్రిప్స్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే బెస్ట్ ట్రిప్ రూట్స్ ఇవే..
శీతాకాలం వచ్చేసింది.. దీనిర్థం ఔత్సాహిక టూరిస్టులకు అనువైన సమయం వచ్చేసిందన్నమాట. వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించే చలికాలంలో స్నేహితులతో టూర్లకు వెళ్లడం చాలా బావుంటుంది. ఫ్రెండ్స్‌తో కాలక్షేప కబుర్లు చెప్పుకుంటూ ముందుకు కొనసాగడం చక్కటి అనుభూతిని అందిస్తుంది. మన దేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు శీతాకాలం మంచిఅనువైన సమయం. చల్లటి వాతావరణం, కనువిందు చేసే దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇలాంటి యాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయతాయి. మరి మీరు కూడా ఈ సీతాకాలంలో రోడ్ ట్రిప్స్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే బెస్ట్ ట్రిప్ రూట్స్ ఇవే..
ఢిల్లీ టు స్పిటి వ్యాలీ..
రాళ్లతో కూడిన మార్గంలో ప్రయాణం ఉంటుంది. పురాతన మఠాలు, స్పిటి వ్యాలీ అందాలు అబ్బురపరుస్తాయి. అందమైన, ఆసక్తిని రేకెత్తించే ఆసక్తికర పర్వత దృశ్యాలు కనువిందు చేస్తాయి. పర్వతాలు, నదులు, లోయల గుండా ప్రయాణం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా సాహసాలను ఇష్టపడే స్నేహితులతో ఈ మార్గంలో ప్రయాణించవచ్చు.
అహ్మదాబాద్ నుంచి కచ్ వరకు..
నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. ముఖ్యంగా రాన్ ఉత్సవ్ సమయంలో ప్రయాణం ఇంకా బావుంటుంది. తెల్ల ఉప్పు ఎడారి, స్థానిక హస్తకళలు, రాన్ ఉత్సవ్ సందర్భంగా ప్రదర్శించే సాంప్రదాయ సంగీతం, నృత్యాలు ఆకట్టుకుంటాయి. విస్తారమైన తెల్ల ఉప్పు ఎడారి యాత్ర ఎంతో ప్రత్యేకంగా, ఆనందకరంగా మార్చుతుంది. రాన్ ఉత్సవ్ సమయంలో జరిగే సాంస్కృతిక నిమజ్జనాలు ఈ రోడ్ ట్రిప్‌ను ఎప్పటికీ గుర్తుండేలా చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
ముంబై టు గోవా..
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ మార్గంలో ప్రయాణం చేయవచ్చు. సుందరమైన తీర ప్రాంత దృశ్యాలు, పచ్చదనం, పశ్చిమ కనుమలలో జలపాతాలు కనుల విందు చేస్తాయి. బీచ్‌లు, వినోదం, విడిది ఎప్పటికీ గుర్తుండేలా ఉంటాయి. గోవాలో రాత్రిపూట గడపడం, ఆకట్టుకునే బీచ్‌లు, రుచికరమైన ఆహారం ఇవన్నీ యాత్రలో ప్రత్యేకంగా అనిపిస్తాయి. స్నేహితులతో కలిసి విడిది తీసుకోవడం ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.
బెంగుళూరు నుంచి కూర్గ్..
అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. కొండలు, కాఫీ తోటలు, జలపాతాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కూర్గ్‌కి వెళ్లే మార్గం అడవులు, కొండల గుండా ఉంటుంది. ఈ క్రమంలో సుందరమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాలు, ట్రెక్కింగ్, కాఫీ తోటలు ఇవన్నీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి.
మనాలి నుంచి లేహ్ వరకు..
మనాలి టు లేహ్ మార్గంలో జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ప్రయాణించడం బావుంటుంది. ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన పర్వత మార్గాలు, సరస్సులు, అద్భుతమైన మఠాలు ఇవన్నీ చాలా బావుంటాయి. అందుకే మన దేశంలో అత్యంత ప్రసిద్ధ చెందిన రోడ్ ట్రిప్ మార్గాలలో ఒకటిగా ఉంది. ఆసక్తిని కలిగించే సుందర పర్వత దృశ్యాలు, ప్రపంచంలోనే కొన్ని ఎత్తైన మార్గాల గుండా ప్రయాణించడం మంచి థ్రిల్‌ను అందిస్తుంది. సాహస యాత్రలు చేయాలనుకునేవారికి ఈ మార్గంలో ప్రయాణం బాగా నచ్చుతుంది.