Share News

Technology: మీటింగ్‌లకు ఏఐ అవతార్‌!

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:09 AM

ఏఐ కాలంలో మరో కొత్త విషయం అనుభవంలోకి రాబోతోంది. అదేమిటంటే, వ్యక్తులకు బదులు ఏఐ అవతార్‌ పనులు చక్కబెట్టబోతోంది. జూమ్‌ మీటింగ్‌ వంటివాటికి ఏఐ అవతార్‌ హాజరవుతుందని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యువాన్‌ చెబుతున్నారు. సంబంధిత సాంకేతికత వాస్తవరూపం ధరించేందుకు అయిదారేళ్ళు పడుతుందని కూడా ఆయన తెలిపారు. ‘ద వెర్జ్‌’ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే ఆచరణలోకి వస్తే కార్పొరేట్‌ టాస్క్‌లకు అనువుగా ఉంటుంది.

Technology: మీటింగ్‌లకు ఏఐ అవతార్‌!

ఐ కాలంలో మరో కొత్త విషయం అనుభవంలోకి రాబోతోంది. అదేమిటంటే, వ్యక్తులకు బదులు ఏఐ అవతార్‌ పనులు చక్కబెట్టబోతోంది. జూమ్‌ మీటింగ్‌ వంటివాటికి ఏఐ అవతార్‌ హాజరవుతుందని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యువాన్‌ చెబుతున్నారు. సంబంధిత సాంకేతికత వాస్తవరూపం ధరించేందుకు అయిదారేళ్ళు పడుతుందని కూడా ఆయన తెలిపారు. ‘ద వెర్జ్‌’ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే ఆచరణలోకి వస్తే కార్పొరేట్‌ టాస్క్‌లకు అనువుగా ఉంటుంది.

మనిషి ఎక్కడున్నా, అర్జెంట్‌గా పిలిచే సమావేశాలకు తనకు బదులు అవతార్‌ను పంపుకోవచ్చు. అయితే ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ అది మనిషి స్థానాన్ని ఏఐ ఆక్రమించుకోలేదని జూమ్‌ సీఈఓ తెలిపారు. అటు పని, ఇటు జీవితం మధ్య సమతుల్యానికి ఇలాంటి సాంకేతిక పురోగతి దోహదపడుతుందని చెప్పవచ్చు. జూమ్‌ విషయానికి వస్తే, ఏఐ పవర్డ్‌ ప్యూచర్‌తో ఏర్పడే గ్యాప్‌ని సరిదిద్దేవిధంగా సాంకేతికను అభివృద్ధి పర్చే పనిలోనే ఉంది. ఇలాంటివి కొంత ఉత్సుకతను కల్పిస్తున్నప్పటికీ భవిష్యత్తులో వీటితో జరిగే విపరిణామాలపైనా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 08 , 2024 | 05:09 AM