Flowers: కనువిందు చేస్తున్న రంగురంగుల పుష్పాలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 01:58 PM

కార్తీక మాసం సందర్భంగా భక్తులు ప్రతీరోజు శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. అలాగే కార్తీక దీపాలు వెలిగిస్తుంటారు. ఈ మాసం మొత్తం శివకేశవులను కొలుస్తుంటారు భక్తులు. అలాగే ఆ మహాదేవునికి వివిధ రకాల పూలతో అలకరిస్తుంటారు. ఇదిలా ఉండగా కడప జిల్లాలో పూసిన రంగురంగుల పుష్పాలు కనువిందు చేస్తున్నారు. వివిధ రంగుల్లో విరివిగా పూసిన పూలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కడప జిల్లా పులివెందుల నుంచి కేకే కొట్టాలులో (యురేనియం ఫ్యాక్టరీ వెళ్లే దారిలో) రైతులు పండించిన పుష్పాలు రంగురంగులతో కనువిందు చేస్తున్నాయి.

Updated at - Nov 09 , 2024 | 01:58 PM