RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్

ABN, Publish Date - Nov 19 , 2024 | 06:59 AM

డిగ్రీ విద్యార్థులకు రిజర్వ్‌బ్యాంక్‌ (Reserve Bank of India) ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహిస్తుంది. ఆర్‌బీఐ స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా క్విజ్‌ పోటీలు జరుగుతున్నాయి. ఇందుకోసం సంబంధిత ఆర్‌బీఐ వైబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ 1/6

క్విజ్‌ పోటీల్లో పాల్గొనే వారు బృందంగా ఏర్పడి నమోదు కావచ్చు. బృందంలో కనీసం ఇద్దరు విద్యార్థులు ఉండాలి.

RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ 2/6

2024 సెప్టెంబరు 1వ తేదీ నాటికి 25 ఏళ్లలోపు వయసు ఉండి ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.

RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ 3/6

పోటీలు స్టేట్‌రౌండ్‌, జోనల్‌ స్థాయి, జాతీయ స్థాయిలో మూడు స్థాయిల్లో జరుగుతాయి. ఈ అవకాశాన్ని డిగ్రీ చదివే విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ 4/6

ఈ క్విజ్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల విద్యార్థులు రూ.10 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది.

RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ 5/6

విద్యార్థుల్లో రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహనతోపాటు డిజిటల్ లావాదేవీలు, సురక్షిత బాధ్యతాయుత వినియోగం తదితరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ పోటీలను నిర్వహిస్తోంది.

RBI quiz: కాలేజీ స్టుడెంట్స్‌కు సువర్ణావకాశం.. రూ. 10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్ 6/6

మొత్తం నాలుగు దశల్లో క్విజ్ పోటీలు జరుగుతాయి. తొలుత జిల్లా స్థాయి, ఆన్‌లైన్ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు.

Updated at - Nov 19 , 2024 | 06:59 AM