Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా?

ABN, Publish Date - Dec 28 , 2024 | 02:20 PM

విటమిన్-సీ సప్లిమెంట్లతో రోగ నిరోధక శక్తి మెరుగవుతుందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. విశేష యాంటీఆక్సిడెంట్ గుణాలున్న విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థకు అనేక రూపాల్లో సహకరిస్తుంది. ఫలితంగా ఇది శరీరానికి అవసరమైన కీలక విటమిన్‌గా మారింది.

Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా? 1/5

ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల ఉత్పత్తికి విటమిన్ సీ ఎంతో కీలకం. తెల్లరక్త కణాల పనితీరు కూడా ఈ విటమిన్‌తో మెరుగవుతుంది

Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా? 2/5

విటమిన్ సీలో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో, ఇది ఫ్రీరాడికల్స్ కలిగించే నష్టం నుంచి రక్తకణాలను కాపాడుతుంది

Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా? 3/5

చర్మంలోని రక్షణ వ్యవస్థను కూడా విటమిన్ సీ బలోపేతం చేస్తుంది. వ్యాధికారక క్రిములను అడ్డుకునే తొలి ఆయుద్ధంగా పనిచేస్తుంది.

Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా? 4/5

గాయాలు త్వరగా మానేందుకు విటమిన్ సీ కీలకం. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కణజాలానికి మరమ్మతులు త్వరగా పూర్తయ్యేలా చేస్తుంది

Vitamin-C: విటమిన్-సీతో సప్లిమెంట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయా? 5/5

ఈ విటమిన్‌తో శరీరం ఐరన్‌ను మరింత సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. ఫలితంగా శరీరంలో ఆక్సీజన్ సరఫరా మెరుగై రోగ నిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుంది.

Updated at - Dec 28 , 2024 | 02:20 PM