బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా?

ABN, Publish Date - Aug 26 , 2024 | 04:32 PM

బృందావనం శ్రీకృష్ణునికి సంబంధించి ప్రత్యేక స్థలం. శ్రీకృష్ణుని బాల్యం అంతా ఇక్కడే గడిచిందని చెబుతారు. బృందావనం మధురలో ఉందని అనుకుంటారు. కానీ ఇది శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురకు 15 కి.మీ దూరంలో యమునా నది ఒడ్డున ఉంది.

బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా? 1/6

కృష్ణునికి, బృందావనానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే బృందావనం గురించి చాలామందికి తెలియని రహస్యాలు కొన్ని ఉన్నాయి.

బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా? 2/6

బృందావనంలో ఉన్న నిధివనంలో శ్రీకృష్ణుడు రాసలీలలు ప్రదర్శిస్తాడట. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఎవరూ ఉండరు.

బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా? 3/6

బృందావనంలో సేవా కుంజ్ గార్డెన్ ఉంది. ఈ తోటలో శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో రాధాదేవిని కలుస్తాడని నమ్మకం. అందుకే సాయంత్రం హారతి తర్వాత ఈ తోట మూసివేయబడుతుంది.

బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా? 4/6

చింత చెట్టు ఇక్కడ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. శ్రీకృష్ణుడు ఈ చెట్టు కింద రాధ దేవికి తల దువ్వేవాడట. ఇక్కడ విశ్రాంతి తీసుకునే ప్రతి ఒక్కరూ శాంతిని, ప్రశాంతతను అనుభూతి చెందుతారట.

బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా? 5/6

మధుర- బృందావనంలో చాలా ఆలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ రంగ్ జీ ఆలయం చాలా ప్రత్యేకం. ఈ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజు తెరుస్తారు.

బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా? 6/6

బృందావనంలో ఉన్న ఒక మర్రిచెట్టు మీద కృష్ణుడు వేణువు వాయించేవాడట. దీన్నే బస్నివట్ దేవాలయం అని పిలుస్తున్నారు.

Updated at - Aug 26 , 2024 | 04:32 PM