కేకేఆర్ కెప్టెన్ రహానె?
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:18 AM
కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కెప్టెన్‌గా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానె నియామకం దాదాపు ఖరారైనట్టు తెలిసింది.

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కెప్టెన్‌గా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానె నియామకం దాదాపు ఖరారైనట్టు తెలిసింది. ఇటీవలి మెగా వేలంలో రహానెను రూ. 1.5 కోట్ల ఆరంభ ధరతో కోల్‌కతా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వేలంలో రూ. 23.75 కోట్ల కళ్లు చెదిరే మొత్తంతో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా దక్కించుకోవడంతో అతడికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని వార్తలొచ్చాయి. కానీ సీనియర్ రహానెను కెప్టెన్‌గా నియమించాలని కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయుంచినట్టు సమాచారం. అందుకే వేలంలో అతడిని కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు. వెంకటేశ్‌ను వైస్-కెప్టెన్ చేయనున్నట్టు తెలిసింది.