Test South Africa vs India : మనమ్మాయిల మరో చరిత్ర
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:33 AM
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత మహిళలు ఏకైక టెస్టులోనూ దుమ్మురేపుతున్నారు. ఓపెనర్లు పరుగుల వరద పారించారు. రికార్డుల బూజు దులుపుతూ టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే ఓపెనర్లు షఫాలీ వర్మ (197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205) డబుల్ సెంచరీతో
తొలిరోజు భారత్ 525/4
స్మృతీ మంధాన (161 బంతుల్లో 27 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 149)
షఫాలీ వర్మ (197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205)
షఫాలీ.. ఫాస్టెస్ట్ డబుల్ జూశతక్కొట్టిన మంధాన
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో రికార్డుల హోరు
చెన్నై: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత మహిళలు ఏకైక టెస్టులోనూ దుమ్మురేపుతున్నారు. ఓపెనర్లు పరుగుల వరద పారించారు. రికార్డుల బూజు దులుపుతూ టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే ఓపెనర్లు షఫాలీ వర్మ (197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205) డబుల్ సెంచరీతో గర్జించగా, స్మృతీ మంధాన (161 బంతుల్లో 27 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 149) శతకంతో కదం తొక్కింది. జెమీమా రోడ్రిగ్స్ (55) అర్ధ సెంచరీ సాధించింది. ఫలితంగా మొదటిరోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 525 పరుగుల భారీ స్కోరు నమోదుచేసింది. ఈ క్రమంలో పలు రికార్డులు వెల్లువెత్తాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో షఫాలీ, మంధాన సఫారీ బౌలర్లను ఆడుకున్నారు. ఇద్దరూ వన్డే తరహాలో రెచ్చిపోవడంతో పరుగులు కట్టడిచేసేందుకు బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. లంచ్ విరామానికల్లా భారత్ వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. ఆ తర్వాత షఫాలీ, స్మృతి దూకుడు పెంచుతూ రికార్డు భాగస్వామ్యంతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు రికార్డుస్థాయిలో 292 పరుగులు జోడించారు. 52వ ఓవర్లో టక్కర్ బౌలింగ్ మంధాన వెనుదిరగగా.. యువ ఓపెనర్ షఫాలీ మాత్రం బాదుడు ఆపలేదు. లేడీ సెహ్వాగ్ తరహాలో బౌలర్లపై శివాలెత్తుతూ సెంచరీ.. ఆ తర్వాత దాన్ని డబుల్ సెంచరీగా మలిచింది. ఈ క్రమంలో మహిళల టెస్టు చరిత్రలోనే అత్యంత వేగంగా.. అంటే 194 బంతుల్లోనే ద్విశతకాన్ని నమోదు చేసింది. టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన షఫాలీ.. చివరకు 205 పరుగుల వద్ద రనౌటైంది. అప్పటికి టీమిండియా స్కోరు 411/3. ఇక, తొలిడౌన్‌లో వచ్చిన శుభా సతీశ్ (15) నిరాశపరచగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (42 నాటౌట్)తో కలిసి రోడ్రిగ్స్ వేగంగా ఆడింది. రోడ్రిగ్స్ అవుటయ్యాక రిచా ఘోష్ (43 నాటౌట్)తో కలిసి హర్మన్ జట్టు స్కోరును 500 దాటించింది. వీళ్లిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించారు.
మహిళల టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా షఫాలీ. 194 బంతుల్లోనే ద్విశతకం బాదిన షఫాలీ.. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అనబెల్ సదర్లాండ్ 248 బంతుల్లో చేసిన డబుల్ సెంచరీ రికార్డును అధిగమించింది.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక (8) సిక్సర్లతో షఫాలీ ప్రపంచ రికార్డు.
ఓవరాల్‌గా (పురుషులు, మహిళల) టెస్టు చరిత్రలో ఒకరోజు అత్యధిక పరుగులు (525) చేసిన తొలి జట్టుగా భారత్. అంతకుముందు 2002లో బంగ్లాదేశ్‌తో టెస్టులో రెండోరోజు ఆటలో శ్రీలంక పురుషుల జట్టు చేసిన 509/9 స్కోరే అత్యుత్తమం. కాగా, మహిళల టెస్టు క్రికెట్లో 1935లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మొదటిరోజు 431/4 స్కోరు చేసింది.
భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్‌గా షఫాలీ. అంతకుముందు 22 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ (214) ఈ ఘనత సాధించింది.
షఫాలీ, మంధాన జోడించిన 292 పరుగులు మహిళల టెస్టు చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ క్రమంలో పాకిస్థాన్ ఓపెనర్లు సాజిదా షా, కిరణ్ బలూచాలు నమోదుచేసిన 241 రన్స్ రికార్డు బద్దలైంది. కాగా, ఆస్ట్రేలియా జంట రీలర్, అన్నెట్ (మూడో వికెట్‌కు 309 రన్స్) తర్వాత షఫాలీ, స్మృతి జోడీ చేసిన పరుగులు ఏ వికెట్‌కైనా రెండో అతిపెద్ద భాగస్వామ్యం.