అమన్ మెరుపు శతకం
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:22 AM
కెప్టెన్ అమన్ (118 బంతుల్లో ఏడు ఫోర్లతో 122 నాటౌట్) మెరుపు శతకంతో చెలరేగగా, కార్తికేయ (57), ఆయుష్ (54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడంతో అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తొలి విజయం అందుకుంది.
జపాన్‌పై యువ భారత్ ఘన విజయం
అండర్-19 ఆసియా కప్
షార్జా: కెప్టెన్ అమన్ (118 బంతుల్లో ఏడు ఫోర్లతో 122 నాటౌట్) మెరుపు శతకంతో చెలరేగగా, కార్తికేయ (57), ఆయుష్ (54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోవడంతో అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తొలి విజయం అందుకుంది. గ్రూప్ ‘ఎ’ మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్..సోమవారం 211 పరుగులతో జపాన్‌ను చిత్తు చేసింది. మొదట భారత్ 50 ఓవర్లలో 339/6తో భారీ స్కోరు సాధించింది. సిద్దార్థ్ (35), హార్దిక్ రాజ్ (25 నాటౌట్), వైభవ్ సూర్యవంశీ (23) ఉపయుక్త ఇన్నింగ్స్ ఆడారు. ఛేదనలో జపాన్ 50 ఓవర్లలో 128/8 స్కోరుకే పరిమితమై ఓడింది. హుగో కెల్లి (50), చార్లెస్ (35 నాటౌట్) మాత్రమే రాణించారు. హార్దిక్, చేతన్ శర్మ, కార్తికేయ తలా రెండు వికెట్లు తీశారు.