Share News

కారు బోల్తా.. క్రికెటర్‌ ముషీర్‌కు గాయం

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:59 AM

ముంబై దేశవాళీ క్రికెటర్‌, భారత బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ (19) రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కారు బోల్తా.. క్రికెటర్‌ ముషీర్‌కు గాయం

లఖ్‌నవూ: ముంబై దేశవాళీ క్రికెటర్‌, భారత బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ (19) రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మంగళవారం నుంచి జరిగే ఇరానీ కప్‌ మ్యాచ్‌ కోసం తన తండ్రి నౌషాద్‌ ఖాన్‌తో కలసి ముషీర్‌.. ఆజమ్‌ఘర్‌ నుంచి కారులో బయల్దేరాడు. అయితే, వారు ప్రయాణిస్తున్న వాహనం లఖ్‌నవూ శివార్లలో డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముషీర్‌కు పెద్దగా గాయాలు కాకపోయినా.. మెడ భాగంలో ఫ్రాక్చరైనట్టు అతనికి చికిత్స అందిస్తున్న మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కోలుకోవడానికి మూడు నెలలు పడుతుందని వెల్లడించాయి. ఫ్రాక్చర్‌ కావడంతో ఇరానీ కప్‌తోపాటు రంజీ ట్రోఫీ కొన్ని మ్యాచ్‌లకు ముషీర్‌ దూరం కానున్నాడు. ముషీర్‌ తండ్రి నౌషాద్‌ కూడా చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.

Updated Date - Sep 29 , 2024 | 05:59 AM