Share News

అగార్కర్‌ వద్దంటేనే..

ABN , Publish Date - May 11 , 2024 | 05:06 AM

చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నిర్ణయం మేరకే శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ను సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితానుంచి తొలగించామని బీసీసీఐ

అగార్కర్‌ వద్దంటేనే..

శ్రేయాస్‌, ఇషాన్‌కు కాంట్రాక్టు నిరాకరణపై జై షా

ముంబై: చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నిర్ణయం మేరకే శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ను సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితానుంచి తొలగించామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. బీసీసీఐ సూచించినా..దేశవాళీ పోటీల్లో ఆడేందుకు నిరాకరించడంతో కాంట్రాక్టు జాబితా నుంచి శ్రేయాస్‌, ఇషాన్‌లను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కిషన్‌..ఐపీఎల్‌ వరకూ ఆటకు అందుబాటులో లేని విషయం విదితమే. మరోవైపు గాయం నుంచి కోలుకున్న అయ్యర్‌ ముంబై తరపున కొన్ని రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ‘శ్రేయాస్‌, ఇషాన్‌ దేశవాళీ పోటీల్లో ఆడలేదు. దాంతో వారిని సెంట్రల్‌ కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించాలని అగార్కర్‌ నిర్ణయించాడు. నా పాత్ర సెలెక్షన్‌ కమిటీ నిర్ణయాలను అమలు పరచడమే’ అని జైషా పేర్కొన్నాడు.

Updated Date - May 11 , 2024 | 05:06 AM