Share News

T20 Worldcup: 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు.. టీమిండియా విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసుల వినూత్న ట్వీట్లు!

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:17 AM

టీ20 ప్రపంచకప్ సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు.

T20 Worldcup: 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు.. టీమిండియా విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసుల వినూత్న ట్వీట్లు!
T20 Worldcup Final

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియా (Teamindia)పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అలాగే రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభినందనలు తెలియజేశారు.


టీమిండియా చారిత్రాత్మక విజయంపై ఢిల్లీ, యూపీ పోలీసులు తమదైన శైలిలో చేసిన ట్వీట్లు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ``బ్రేకింగ్‌ న్యూస్‌.. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టి దోషులుగా నిలిచారు. భారత్‌లోని కోట్లాదిమంది క్రికెట్‌ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు`` అంటూ యూపీ పోలీస్ (UP Police tweet on T20 World Cup win)విభాగం ట్విటర్‌లో పేర్కొంది. యూపీ పోలీసులు చేసిన ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఈ ట్వీట్‌కు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


ఢిల్లీ పోలీసులు (Delhi Police tweet on T20 World Cup win) ఈ విజయాన్ని ట్రాఫిక్‌కు ముడిపెడుతూ విభిన్నమైన ట్వీట్ చేశారు. ``టీమిండియా మరో టీ20 వరల్డ్‌ కప్‌ గెలవాలని దేశ ప్రజలంతా 16 ఏళ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచి చూశాం. ఇదే విధంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కూడా ఓపికతో వేచి ఉందాం. మంచి క్షణాల కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. మీరేమంటారు? టీమిండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు`` అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా అందుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?


T20 Worldcup: వారం ముందే బర్త్‌డే గిఫ్ట్.. నా హార్ట్ రేట్ పెరిగిపోయింది.. టీమిండియా విజయంపై ధోనీ స్పందన!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 30 , 2024 | 11:17 AM