Share News

Ind vs Aus: ఆస్ట్రేలియాను ఇంటికి పంపిస్తారా? అఫ్గాన్లకు దారి చూపుతారా? కీలక పోరుకు సిద్ధమవుతున్న టీమిండియా

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:19 PM

టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా ఈ టోర్నీలోనే అసలు సిసలైన మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు పాకిస్తాన్ తప్ప అన్నీ చిన్న జట్లతోనే తలపడింది. తొలిసారి కంగారూలను ఢీకొట్టబోతోంది.

Ind vs Aus: ఆస్ట్రేలియాను ఇంటికి పంపిస్తారా? అఫ్గాన్లకు దారి చూపుతారా? కీలక పోరుకు సిద్ధమవుతున్న టీమిండియా
Team India

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldup)లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా ఈ టోర్నీలోనే అసలు సిసలైన మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు పాకిస్తాన్ తప్ప అన్నీ చిన్న జట్లతోనే తలపడింది. తొలిసారి కంగారూలను ఢీకొట్టబోతోంది (India vs Australia). ఈ మ్యాచ్ ఫలితం సెమీస్ జట్లను నిర్ణయిస్తుంది (T20 Worldup Semis). ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉన్న భారత్.. ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ భవితవ్యాన్ని తేల్చబోతోంది. టీమిండియా తన సూపర్-8 చివరి మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సెయింట్ లూసియాలో తలపడబోతోంది.


ఇప్పటికే సెమీస్ రేస్‌లో ముందున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. గత మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఇంటి దారి పడుతుంది. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిపోయి, బంగ్లాదేశ్‌పై అఫ్గాన్ 83 పరుగుల తేడాతో విజయం సాధిస్తే తప్ప టీమిండియా ఇంటి దారి పట్టేది ఉండదు. ఈ నేపథ్యంలో సెమీస్ బెర్త్ కోసం అస్ట్రేలియా, అఫ్గాన్ మధ్యే పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బలమైన ఆస్ట్రేలియాను ఇంటికి పంపించాలని రోహిత్ సేన కృతనిశ్చయంతో ఉంది.


ఇప్పటివరకు ఈ టోర్నీలో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ, రోహిత్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఆస్ట్రేలియా మీద కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సూర్య ఫామ్, హార్దిక్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్, బుమ్రా సూపర్ బౌలింగ్ భారత్‌కు సానుకూలాంశాలు. ఇక, అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. అయితే ఒత్తిడి పరిస్థితుల్లోనే అమోఘంగా రాణించే అలవాటున్న కంగారూలను తక్కువ అంచనా వేస్తే టీమిండియా మూల్యం చెల్లించక తప్పదు.

తుది జట్లు (అంచనా):

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా, అర్ష్‌దీప్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా

ఆస్ట్రేలియా:

ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, వేడ్, కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, జంపా

ఇవి కూడా చదవండి..

T20 World Cup: అలా జరిగితే.. భారత జట్టు ఇంటిదారి పట్టడమే!


T20 Worldcup: వామ్మో.. క్రికెట్‌లో ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయా? క్యాచ్ కోసం వెళ్లి ఎలా గాయపడ్డారో చూడండి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 24 , 2024 | 04:19 PM