IPL : క్లాసెన్‌కు జాక్‌పాట్
ABN , Publish Date - Nov 02 , 2024 | 06:53 AM
ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది. రాబోయే 17వ సీజన్ కోసం డిసెంబరులో మెగా వేలం జరుగబోతోంది. అంతకన్నా ముందే లీగ్‌లోని పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అక్టోబరు 31తో గడువు ముగియడం తో అదే రోజు అన్ని జట్లు గరిష్ఠంగా
క్లాసెన్‌కు జాక్ పాట్..
రూ.23 కోట్లతో అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్
విరాట్, పూరన్‌కు రూ.21 కోట్లు
అన్‌క్యా్‌పడ్‌గా ఎంఎస్ ధోనీ
వేలంలోకి పంత్, శ్రేయాస్, రాహుల్
ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా వెల్లడి
ముంబై: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది. రాబోయే 17వ సీజన్ కోసం డిసెంబరులో మెగా వేలం జరుగబోతోంది. అంతకన్నా ముందే లీగ్‌లోని పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అక్టోబరు 31తో గడువు ముగియడం తో అదే రోజు అన్ని జట్లు గరిష్ఠంగా ఆరుగురితో కూడిన తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించేశాయి. దీంతో ఎవరు వేలంలోకి వెళ్లబోతున్నారనేది స్పష్టమైంది. ఇందులో పలు ఫ్రాంచైజీలు ఆరుగురికన్నా తక్కువ మందితోనే సరిపెట్టుకున్నాయి. తద్వారా ఈ జట్లకు భారీ మొత్తంతో వేలంలోకి వెళ్లే వెసులుబాటు లభించింది. ఇక ఈసారి సీఎ్‌సకే తరఫున ధోనీ బరిలోకి దిగుతాడా? లేదా? అనే ఊహాగానాలకు కూడా తెరపడింది. అన్‌క్యా్‌పడ్ ప్లేయర్‌గా ధోనీని చెన్నై జట్టు రిటైన్ చేసుకుంది. భారత్ తరఫున ఆడక ఐదేళ్లు అయిన రిటైర్డ్ ఆటగాళ్లను అన్‌క్యా్‌పడ్‌గా పరిగణిస్తారు. అలాగే రోహిత్‌ను వేలంలోకి వదిలేస్తారని భావించినా.. ముంబై అతడిపై నమ్మకముంచింది. ఓవరాల్‌గా పంజాబ్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో అత్యధికంగా రూ.110.5 కోట్లతో, రాజస్థాన్ ఆరుగురిని ఎంపిక చేసుకోవడంతో అత్యల్పంగా రూ.41 కోట్లతో వేలానికి సిద్ధం కానున్నాయి.
ఆ ముగ్గురిపై అందరి దృష్టి
మెగా వేలానికి ముందు మూడు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలేస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్‌కు ఆ జట్టు యజమానితో విభేదాలు ఉండడంతో వేలంలోకి వస్తాడని భావించినా.. కేకేఆర్ శ్రేయా్‌సను, డీసీ పంత్‌ను వదులుకోవడం ఊహించనిదే. అయితే వేలంలో వీరిపై ఆయా జట్లు భారీ మొత్తాలను వెచ్చించే అవకాశం లేకపోలేదు. అలాగే డెత్ ఓవర్లలో వికెట్లను తీసే పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను సైతం పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకునేందుకు ఇష్టపడలేదు. అలాగే వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, పేసర్లు దీపక్ చాహర్, సిరాజ్ సైతం వేలంలోకి రానున్నారు. విదేశీ ఆటగాళ్లలో ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసీ, మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, శాంట్నర్, గ్రీన్, జాక్స్, మ్యాక్స్‌వెల్, కాన్వే, రచిన్‌లను ఆయా జట్లు వదిలేయడంతో వీరు కూడా అధిక ధర పలికే చాన్స్ ఉంది.
తొలి భారత ఆటగాడిగా విరాట్..
పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ధర విషయంలో ఇప్పటివరకు విదేశీ ఆటగాళ్లదే హవా. అన్ని జట్లు వారిపైనే ఎక్కువ మొత్తం వెచ్చించేందుకు సిద్ధపడుతుంటాయి. ఈనేపథ్యంలో తొలిసారిగా ఓ భారత ఆటగాడు రూ.20 కోట్లకు పైన ధర పలకడం విశేషం. విరాట్ కోహ్లీని ఆర్‌సీబీ జట్టు రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో రూ.20+ కోట్లు పలికిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు స్టార్క్, కమిన్స్ ఈ క్లబ్‌లో ఉన్నారు.
అమ్మో.. అంత ధరా?
దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్‌పై కనకవర్షం కురిసింది. గత సీజన్‌లో విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించిన క్లాసెన్‌పై సన్‌రైజర్స్ ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించింది. ఇది ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర. గత వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇత ర విదేశీ ఆటగాళ్లయిన నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు)పై లఖ్‌నవూ, కోహ్లీ (రూ. 21 కోట్లు) పై బెంగళూరు, ప్యాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)పై సన్‌రైజర్స్ భారీ మొత్తాలను వెచ్చించి రిటైన్ చేసుకున్నాయి.
ఆర్‌టీఎం అంటే..
2018లో చివరిసారి రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్‌ను ఉపయోగించగా, తిరిగి ఈసారి ప్రవేశపెట్టారు. మెగా వేలంలోకి వదిలేసిన తమ ఆటగాళ్లను తిరిగి అదే జట్టు తీసుకోవాలనుకుంటే ఈ ఆర్‌టీఎంను ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలో అయితే ప్రత్యర్థి ఫ్రాంచైజీ ఎంత బిడ్ వేసిందో అంతే మొత్తం చెల్లించి తమకు కావాల్సిన ప్లేయర్‌ను ఆయా జట్లు తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి బీసీసీఐ ఆ నిబంధనను మార్చింది. దీనిప్రకారం ముందుగా బిడ్ వేసిన టీమ్‌కు మరోసారి పోటీలో ఉండే చాన్స్ లభిస్తుంది. అంటే ఆ జట్టు తిరిగి వేలం కొనసాగించవచ్చు. అప్పుడు ఆ పెరిగిన ధర చెల్లిస్తేనే ఆర్‌టీఎం ద్వారా పాత జట్లు తమకు కావాల్సిన ప్లేయర్లను సొంతం చేసుకుంటాయి. ఇక రిటెన్షన్ ప్రక్రియలో అట్టిపెట్టుకునే ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడమా? లేక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ద్వారా తిరిగి తీసుకోవడమా? అనేది పూర్తిగా ఫ్రాంచైజీల నిర్ణయానికే వదిలేశారు.
ధర ఎందుకు పెరిగిందంటే..
ఐపీఎల్ రిటెన్షన్ రూల్ ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాడి అత్యధిక ధర రూ.18 కోట్లు. ఆ తర్వాత మిగిలిన వారికి వరుసగా రూ.14 కోట్లు, రూ.11 కోట్లు, రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఇది బీసీసీఐ నిర్దేశించిన కనీస పరిమితి మాత్రమే. ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాడికి ఎంత మొత్తమైనా చెల్లించి రిటైన్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీని ప్రకారమే క్లాసెన్‌కు రైజర్స్ జట్టు రూ.23 కోట్లు, ఆర్‌సీబీ విరాట్‌కు రూ.21 కోట్లు, లఖ్‌నవూ పూరన్‌కు రూ.21 కోట్లు ఇచ్చాయి.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ : రూ.18 కోట్లు
పతిరణ : రూ.13 కోట్లు
దూబే : రూ.12 కోట్లు
జడేజా : రూ.18 కోట్లు
ధోనీ : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.65 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.55 కోట్లు
ముంబై ఇండియన్స్
బుమ్రా : రూ.18 కోట్లు
సూర్యకుమార్ : రూ.16.35 కోట్లు
హార్దిక్ : రూ.16.35 కోట్లు
రోహిత్ : రూ.16.30 కోట్లు
తిలక్‌వర్మ : రూ.8 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.75 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.45 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ : రూ.21 కోట్లు
రజత్ పటీదార్ : రూ.11 కోట్లు
యష్ దయాల్ : రూ.5 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.37 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.83 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్
రింకూ సింగ్ : రూ.13 కోట్లు
వరుణ్ చక్రవర్తి : రూ.12 కోట్లు
నరైన్ : రూ.12 కోట్లు
రస్సెల్ : రూ.12 కోట్లు
హర్షిత్ రాణా : రూ.4 కోట్లు
రమణ్‌దీప్ : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.69 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.51 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్ : రూ.16.50 కోట్లు
కుల్దీప్ యాదవ్ : రూ.13.25 కోట్లు
స్టబ్స్ : రూ.10 కోట్లు
అభిషేక్ పోరెల్ : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.47 కోట్లు
మిగిలిన మొత్తం: రూ.73 కోట్లు
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్ : రూ.21 కోట్లు
రవి బిష్ణోయ్ : రూ.11 కోట్లు
మయాంక్ యాదవ్ : రూ.11 కోట్లు
మొహిసిన్ ఖాన్ : రూ.4 కోట్లు
ఆయుష్ బదోని : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.51 కోట్లు
మిగిలిన మొత్తం : రూ.69 కోట్లు
పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్ : రూ.5.5 కోట్లు
ప్రభ్‌సిమ్రన్ : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.9.5 కోట్లు
మిగిలిన మొత్తం : రూ.110.5 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
క్లాసెన్ : రూ.23 కోట్లు
కమిన్స్ : రూ.18 కోట్లు
అభిషేక్ : రూ.14 కోట్లు
హెడ్ : రూ. 14 కోట్లు
నితీశ్ కుమార్ : రూ.6 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.75 కోట్లు
మిగిలిన మొత్తం : రూ.45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్
శాంసన్ : రూ.18 కోట్లు
జైస్వాల్ : రూ.18 కోట్లు
పరాగ్ : రూ.14 కోట్లు
జురెల్ : రూ.14 కోట్లు
హెట్‌మయెర్ : రూ.11 కోట్లు
సందీప్ శర్మ : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.79 కోట్లు
మిగిలిన మొత్తం : రూ.41 కోట్లు
గుజరాత్ టైటాన్స్
రషీద్ ఖాన్ : రూ.18 కోట్లు
శుభ్‌మన్ గిల్ : రూ.16.50 కోట్లు
సాయి సుదర్శన్ : రూ.8.50 కోట్లు
తెవాటియా : రూ.4 కోట్లు
షారుక్ ఖాన్ : రూ.4 కోట్లు
వెచ్చించిన మొత్తం: రూ.51 కోట్లు
మిగిలిన మొత్తం : రూ.69 కోట్లు