Share News

T20 Worldcup: టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన మైకేల్ వాన్.. చెత్త అంటూ హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jun 28 , 2024 | 02:36 PM

దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించింది. భారత్ సాధించిన విజయంపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ మాత్రం ఎప్పటిలాగానే టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు.

T20 Worldcup: టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన మైకేల్ వాన్.. చెత్త అంటూ హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్
Harbhajan Singh's Fiery Reply To Michael Vaughan

దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) ఫైనల్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. గురువారం ఇంగ్లండ్‌తో (India vs England) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించింది. భారత్ సాధించిన విజయంపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ (Michael Vaughan) మాత్రం ఎప్పటిలాగానే టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. సెమీస్ మ్యాచ్ జరిగిన గయానా పిచ్ (Guyana Pitch) వల్లే టీమిండియా విజయం సాధించిందని, ఆ పిచ్ భారత ఆటగాళ్లకు చక్కగా సరిపోతుందని వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు.


``సూపర్-8‌లో దక్షిణాఫ్రికాను ఇంగ్లండ్ ఓడించి ఉంటే అప్పుడు వారు ట్రినిడాడ్‌కు (అఫ్గాన్ ఆడిన సెమీ ఫైనల్ వేదిక) వెళ్లి ఉండేవారు. అక్కడ వారు సులభంగా గెలిచి ఉండేవారు. స్పిన్నర్లకు అనుకూలించే గయానా పిచ్‌పై ఇంగ్లీష్ ఆటగాళ్లు తడబడతారు. ఆ పిచ్ ఇండియన్ల ఆటతీరుకు సరిగ్గా సరిపోతుంది. భారత్‌కు అది సరైన ఎంపిక`` అంటూ వాన్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ఈ కామెంట్లపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. మైకేల్ వాన్‌కు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాడు.


``గయానా పిచ్ భారత్‌కు మంచి వేదిక అనుకుంటున్నావా? రెండు జట్లు ఒకే పిచ్‌పై ఆడాయి కదా. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లండ్ కంటే మెరుగ్గా ఆడడం వల్లే భారత్ విజయం సాధించింది. చిల్లరగా ప్రవర్తించవద్దు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించు. నీ చెత్త మొత్తాన్ని నీ దగ్గరే ఉంచుకో. లాజిక్‌గా మాట్లాడు. పిచ్చి ఆరోపణలు చేయకు`` అంటూ భజ్జీ ఘాటుగా స్పందించాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: కోహ్లీ ఫామ్‌ గురించి రోహిత్ అదిరిపోయే ఆన్సర్.. ఫైనల్లో అదే జరుగుతుందున్న కెప్టెన్!


T20 Worldcup: ఇంగ్లండ్‌తో విజయం అనంతరం రోహిత్ శర్మ కన్నీళ్లు.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 28 , 2024 | 02:36 PM