Lakshyasen : సెమీస్‌లో లక్ష్య
ABN , Publish Date - Aug 03 , 2024 | 06:25 AM
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారి్‌సలో రికార్డుస్థాయి ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. సహచరులంతా విఫలమైన చోట.. 22 ఏళ్ల సేన్ మాత్రం సెమీఫైనల్లో ప్రవేశించి బ్యాడ్మింటన్‌లో భారత పతక ఆశలను
సేన్ సంచలనం
స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారి్‌సలో రికార్డుస్థాయి ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. సహచరులంతా విఫలమైన చోట.. 22 ఏళ్ల సేన్ మాత్రం సెమీఫైనల్లో ప్రవేశించి బ్యాడ్మింటన్‌లో భారత పతక ఆశలను నిలబెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్ లక్ష్యసేన్ 19-21, 21-15, 21-12 తేడాతో చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్‌పై సంచలన విజయం సాధించాడు. 75 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో హోరాహోరీ పోటీ ఇచ్చినా ఫలితం అనుకూలంగా రాలేదు. అయితే మిగిలిన రెండు గేమ్‌ల్లో మాత్రం చెన్‌కు చెమటలు పట్టించాడు. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనుకాకుండా సేన్ ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరిన తొలి భారత పురుష సింగిల్స్ షట్లర్‌గా సేన్ రికార్డుకెక్కాడు. ఇప్పటిదాకా భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌దాకా చేరగలిగారు. ఇక, మహిళల సింగిల్స్‌లో మాత్రం సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.